Minerals Foods: ఖనిజాలతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా?
Minerals Foods: ఫిట్‌గా ఉండేందుకు శరీరానికి కొన్ని ఖనిజాలు అవసరం. వాటిని తీసుకోవడం ద్వారా మీరు ఆరోగ్యం ఉంటారు.
Minerals Foods: మనం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి కొన్ని రకాల పోషకాలు అవసరం. ఇందులో విటమిన్లు, పీచుపదార్ధాలు, ప్రోటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్లు ముఖ్యమైనవి. ఎముకల ధృడంగా ఉండాలంటే వీటిని తీసుకోవాలి. వీటితో పాటు మన ఆరోగ్యానికి ఖనిజాలు (Minerals ) కూడా చాలా అవసరం. ఈ రోజు అలాంటి తినడానికి వీలైన కొన్ని ఖనిజాలు గురించి తెలుసుకుందాం.
మాంగనీస్
మాంగనీస్ చాలా ముఖ్యమైన ఖనిజంగా పరిగణించబడుతుంది. ఈ మూలకం లోపిస్తే ఉదర సంబంధిత వ్యాధులు వస్తాయి. అంతేకాక జ్ఞాపక శక్తి బలహీనపడుతుంది. శరీరానికి సరైన మెుత్తంలో మాంగనీస్ అవసరం. దీని లోపం కారణంగా ఇంకా గుండె సమస్యలు, హై బీపీ, ఎముక సంబంధిత వ్యాధులు వస్తాయి. అందుకే మాంగనీస్ ఆహారంలో భాగంగా చేర్చుకోవాలి.
సల్ఫర్
సల్ఫర్ కూడా ఒక ముఖ్యమైన మూలకం. సల్ఫర్ ఉన్న ఆహారాన్ని తీసుకోవడం శరీరానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది మన కణాలను బలపరుస్తుంది. ఇది కాకుండా, మన శరీర రక్తాన్ని శుభ్రపరచడంలో పనిచేస్తుంది. మీ శరీరంలో అది లోపిస్తే.. వ్యక్తికి నీరసం, అలసట మరియు బలహీనత వంటి సమస్యలు ఉంటాయి. బ్రోకలీ, ముల్లంగి, అల్లం, ఉల్లిపాయలు, సోయాబీన్ మొదలైన వాటిలో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది.
జింక్
గ్రేటర్ నోయిడాలోని GIMS హాస్పిటల్‌లో పనిచేస్తున్న ప్రముఖ డైటీషియన్ డాక్టర్ ఆయుషి యాదవ్ మాట్లాడుతూ... మన శరీరానికి జింక్ చాలా ముఖ్యమైనదని చెప్పారు. ఇది మన ఆరోగ్యానికి అవసరమైన ఖనిజం. దీని వల్ల మన రోగనిరోధక వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. ఇది మన నాడీ వ్యవస్థ మరియు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఉపయోగపడుతుంది. జట్టు రాలు సమస్యను అరికడుతుంది. జింక్ అధిక మెుత్తంలో కావాలంటే... మీరు పుట్టగొడుగులు, వేరుశెనగ, కాయధాన్యాలు, బీన్స్, గుడ్లు తినవచ్చు.
Also Read: Neem leaves Benefits: వేప ఆకులతో గుండెపోటుకు చెక్! ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.