Health Cautions: శరీరంలో అంతర్గతంగా జరిగే పలు మార్పులు లేదా అంతర్గతంగా ఏర్పడే లోపాలు వివిధ రకాల అనారోగ్య సమస్యలకు కారణమౌతుంటాయి. కొన్ని సందర్భాల్లో పరిస్థితి విషమించేవరకూ తెలియదు. అందుకే ఏడాదికోసారి అయినా వైద్య పరీక్షలు చేయించుకోవడం ఉత్తమమని వైద్యులు సూచిస్తుంటారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అసలు ఆరోగ్యానికి ప్రమాణాలేంటి, బీపీ ఎంత ఉండాలి, షుగర్ ఎంత ఉండవచ్చు, కొలెస్ట్రాల్ ఎంంత ఉంటే ప్రమాదకరం, హిమోగ్లోబిన్ ఏ పరిమాణంలో ఉండాలి,  సోడియం-పొటాషియం స్థాయి ఎంత ఉండాలి. ప్లేట్‌లెట్స్ ఎంత ఉంటే ఆరోగ్యం ఇలా చాలా అంశాలు తెలుసుకోవడం ముఖ్యం. చాలామందికి ఈ వివరాలపై పెద్దగా అవగాహన ఉండకపోవచ్చు. అందుకే శరీరంలో ఏవి ఎంత పరిమాణంలో ఉండాలనే వివరాలతో కూడిన జాబితా మీ కోసం ఇక్కడ ఇస్తున్నాం..


బీపీ                                            120-80
హార్ట్ బీట్                                    70-100
శరీర ఉష్ణోగ్రత                            36.8-37
హిమోగ్లోబిన్  మగవారికి               13.5-18
హిమోగ్లోబిన్ ఆడవారికి                11.50-16
కొలెస్ట్రాల్                                   130-200
ట్రై గ్లిసరాయిడ్స్                        220
సోడియం                                   135-145
పొటాషియం                              3.50-5
పీసీవీ శరీరంలో రక్తం                 30-40 శాతం
రక్తంలో చక్కెర                          70-115
రక్తంలో ఐరన్                            8-15 మిల్లీగ్రాములు
తెల్ల రక్తకణాలు                         4000-11000
ఎర్ర రక్తకణాలు                         4.50 -6 మిలియన్
ప్లేట్‌లెట్స్                                1.50-4 లక్షలు
కాల్షియం                                   8.6-10.3 
విటమిన్ డి3                             20-50
విటమిన్ బి12                           200-900


పైన చెప్పిన వివిధ పరిమాణాల్లో ఎందులోనైనా ఎక్కువ తక్కువలు కన్పిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది. ఎందుకంటే కొన్ని అంశాలకు సకాలంలో చికిత్సే సరైన పరిష్కారం కాగలదు. తేలిగ్గా తీసుకుంటే ప్రమాదకరంగా మారుతుంది. అందుకే ఎప్పటికప్పుడు ఆరోగ్య రక్త పరీక్షల ద్వారా ఈ అంశాలన్నీ సరిగా ఉన్నాయో లేవో చెక్ చేసుకోవడం మంచిది.


Also read: Health Tips: వాము నీటిలో నిమ్మరసం పిండి తాగితే...మరణం తప్ప అన్నింటికీ చెక్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook