Raita Side Effects: ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఆహార పదార్థం వేడి లేదా చల్లటి స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఈ స్వభావం ఆధారంగానే ఆహారాలను కలిపి తీసుకోవడం ఆరోగ్యకరం. ఉల్లిపాయ వేడి స్వభావాన్ని కలిగి ఉంటే, పెరుగు చల్లటి స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో అసమతుల్యత ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా చాలా మంది రైతాను అతిగా తింటారు. కానీ ఆయుర్వేదంలో కొన్ని పదార్థాలను పెరుగులో కలుపుకొని తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పెరుగు, ఉల్లిపాయ కలిపి తినడం వల్ల జీర్ణక్రియ వ్యవస్థ దెబ్బతింటుంది. దీని కడుపు నొప్పి ఇతర సమస్యలు కలుగుతాయి. ఉల్లిపాయలో  సల్ఫర్ అధికంగా ఉంటుంది. పెరుగులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు కలవడం వల్ల శరీరానికి అనారోగ్య సమస్యలు కలుగుతాయి. పెరుగు, ఉల్లిపాయ కలిపి తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి నష్టాలు కలుగుతాయి అనేది తెలుసుకుందాం.


జీర్ణ సమస్యలు: పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఉల్లిపాయల్లో సల్ఫర్ సమ్మేళనాలు ఉంటాయి. ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు, అజీర్ణం, గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.


చర్మ సమస్యలు: ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో అధిక వేడి ఉత్పత్తి అవుతుంది. ఇది టాక్సిన్స్ స్థాయిని పెంచుతుంది. దీంతో చర్మంపై దద్దుర్లు, తామర, సోరియాసిస్ వంటి చర్మ అలెర్జీలు వచ్చే అవకాశం ఉంది.


శరీర ఉష్ణోగ్రత పెరగడం: ఉల్లిపాయ వేడి స్వభావాన్ని కలిగి ఉండటం వల్ల ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉంది.


హార్మోన్ల అసమతుల్యత: ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడే అవకాశం ఉంది.


ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లలు ఈ కలయికను తీసుకోవడం మంచిది కాదు. అయితే ఉల్లిపాయను వేయించి పెరుగులో కలిపి తీసుకుంటే పైన చెప్పిన సమస్యలు తక్కువగా ఉంటాయి. ప్రతి వ్యక్తి శరీరం వేరు వేరుగా ఉంటుంది. కొంతమందికి ఈ కలయిక ఎలాంటి సమస్యలను కలిగించకపోవచ్చు. అయినప్పటికీ, ఆయుర్వేదం ప్రకారం ఈ రెండింటిని కలిపి తీసుకోవడం ఆరోగ్యకరం కాదు. ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నట్లయితే, మీరు మీ వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.


ముఖ్యమైన విషయం: ఈ సమాచారం కేవలం సమాచారం కోసం మాత్రమే. ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నట్లయితే, మీరు మీ వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.


Read more: KTR Case: నేను సాదాసీదా వ్యక్తి కాదు.. కొండా సురేఖను శిక్షించాల్సిందే: కోర్టులో కేటీఆర్‌



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.