Skin Colour Change: మీ చర్మం రంగు మారుతుంటే...తస్మాత్ జాగ్రత్త, కేన్సర్ వంటి తీవ్ర వ్యాధులు కావచ్చు
Skin Colour Change: మీ చర్మం ఉన్నట్టుంది రంగు మారుతుంటే తస్మాత్ జాగ్రత్త. చాలా వ్యాధులకు ఇదే సంకేతమవుతుంటుంది. చర్మం రంగు మారుతుంటే..ఏయే వ్యాధుల ముప్పు ఉన్నట్టో ఇప్పుడు తెలుసుకుందాం..
Skin Colour Change: మీ చర్మం ఉన్నట్టుంది రంగు మారుతుంటే తస్మాత్ జాగ్రత్త. చాలా వ్యాధులకు ఇదే సంకేతమవుతుంటుంది. చర్మం రంగు మారుతుంటే..ఏయే వ్యాధుల ముప్పు ఉన్నట్టో ఇప్పుడు తెలుసుకుందాం..
మన శరీరంలోపల అంతర్గతంగా ఏదైనా వ్యాధి ప్రారంభమైనా లేదా ఏదైనా అనారోగ్య సమస్య తలెత్తినా ఏదో ఓ రూపంలో లక్షణాలు లేదా సంకేతాలు బయటపడుతుంటాయి. అందులో ఒకటి చర్మం రంగు మారడం. చాలా వ్యాధులకు చర్మం పసుపు, నీలం లేదా ఎరుపు రంగులో మారుతుంటుంది. ఇలా చర్మం రంగు మారిందంటే..లోపల అంతర్గతంగా ఏదో తీవ్రమైన వ్యాధి ప్రారంభమైనట్టే అర్దం చేసుకోవాలి. ఆ కారణాలు, ఆ వ్యాధులేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
శరీరంలో అతిపెద్ద భాగం చర్మమే. అన్ని అవయవాలు కప్పి ఉండేది ఈ చర్మంతోనే. శరీరంలోపల ఏదైనా సమస్య ఏర్పడితే చర్మం ద్వారానే బయటపడుతుంది. చాలా సందర్భాల్లో చర్మం రంగు మారుతుంటుంది. మీ చర్మం పసుపుగా మారుతుంటే..లివర్ సమస్య ఉందని అర్దం చేసుకోవచ్చు. నీలం రంగులో మారుతుంటే..శ్వాస సంబంధిత వ్యాధి ఉన్నట్టు అర్ధం. రక్త సంబంధిత వ్యాధి ఉన్నా చర్మం రంగు మారుతుంటుంది.
కేన్సర్ రోగుల్లో చికిత్స కారణంగా తలెత్తే సైడ్‌ఎఫెక్ట్స్ ట్యూమర్ పెరుగుదల లేదా ఎండ కారణంగా కూడా చర్మం రంగు మారుతుంటుంది. చర్మం పసుపుగా మారడం లేదా కళ్లలో తెలుపు భాగం పసుపుగా మారుతుంటే జాగ్రత్తగా ఉండాలి. డార్క్ పింక్ లేదా గోధుమ రంగులో యూరిన్ వస్తుంటే అప్రమత్తం కావాలి. తెలుపు, మట్టి రంగు, గ్రే రంగులో మల విసర్జన ఉంటే అశ్రద్ధ చేయకూడదు. చర్మం నీలిరంగులో మారడం లేదా వంకాయ రంగులో ఉండటం కూడా ఏదో ఒక తీవ్రమైన వ్యాధికి కారణం కావచ్చు. చర్మం ఎరుపు రంగులో మారడం లేదా చిన్న చిన్న గింజల్లాంటివి ఏర్పడటం కూడా వ్యాధి లక్షణం.
ఏం చేయాలి
వేడి నీళ్లు, మృదువైన సబ్బుతో చర్మాన్ని శుభ్రం చేసుకోవాలి. ఎక్కడైతే ఎక్కువగా ప్రభావితమైందో ఆ ప్రాంతాన్ని ఎప్పుడూ క్లీన్ చేస్తుండాలి. చర్మాన్ని సాధ్యమైనంతవరకూ తేమగా ఉంచేందుకు ప్రయత్నించాలి. ప్రభావితమైన ప్రాంతాన్ని వేడి, చలి నుంచి సంరక్షించాలి. స్కిన్ రియాక్షన్ కాకుండా మందులు వాడాలి. వదులైన మృదువైన బట్టలే ధరించాలి. ఎండలో తిరగకుండా జాగ్రత్త పడాలి.
ఒకవేళ చర్మం లేదా కళ్లలోని తెలుపు భాగం పసుపు రంగులో మారితే లేదా రోజంతా ఆరెంజ్ లేదా గోధుమ రంగులో యూరిన్ వచ్చినా కేన్సర్ ప్రమాదాన్ని ఊహించుకుని వైద్యుడిని సంప్రదించాలి. చర్మంపై దురద ఎక్కువగా ఉన్నా అప్రమత్తం కావాలి. శరీరంపై గాయం లేదా నీలి మచ్చలు వారమంతా ఉంటే..కేన్సర్ నిపుణుడిని సంప్రదించాలి.
Also read: Leg Pain Relief Tips: తీవ్రమైన కాళ్ల నొప్పుల సమస్యకు..ఈ చిట్కాలతో ఇక చెక్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook