Leg Pain Relief Tips: ఇటీవలి కాలంలో కాళ్ల నొప్పుల సమస్యలు అధికంగా కన్పిస్తున్నాయి. గతంలో వృద్ధాప్యంలో కన్పించే ఈ లక్షణాలు ఇప్పుడు అందరిలోనూ ఉంటున్నాయి. బాధించే ఈ సమస్య నుంచి ఉపశమనం కోసం సులభమైన ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
ఒకప్పుడు కాళ్ల నొప్పులంటే ఓ వయస్సు దాటిన తరువాత కన్పించేవి. అంటే ఎక్కువగా వృద్ధుల్లో వచ్చే సమస్య ఉంది. కానీ ఇప్పుడు వయస్సుతో సంబంధం లేకుండా అందర్నీ పట్టి పీడిస్తోంది. అది కూడా భయంకరమైన నొప్పి ఉంటుంది. కూర్చోలేం..నిలుచోలేం..పడుకోలేం. కాళ్ల మాంసపుకృతుల్లో ఎక్కువగా ఉంటుంది ఈ నొప్పి. ఈ సమస్యపై వెంటనే అప్రమత్తం కాకపోతే మరింత పెరుగుతుంది. కొన్ని సులభమైన హోమ్ రెమిడీస్ ద్వారా ఆ నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు..
గానుగ నూనెతో మస్సాజ్
గానుగ నూనెతో కాళ్ల నొప్పుల్నించి చాలావరకూ ఉపశమనం పొందవచ్చు. రాత్రి నిద్రపోయే ముందు గానుగ నూనెను వేడి చేసి కాళ్లకు రాస్తూ బాగా మస్సాజ్ చేయాలి. దీనివల్ల చాలావరకూ ఉపశమనం కలుగుతుంది.
యాపిల్ సైడర్ వెనిగర్, తేనెతో..
కాళ్ల నొప్పులున్నప్పుడు యాపిల్ సైడర్ వెనిగర్‌తో కూడా ప్రయోజనం కలుగుతుంది. ఇందులో ఉండే ఎనాల్జెసిక్ గుణాలు కాళ్ల వాపు లేదా నొప్పిని తగ్గించడంలో కీలకపాత్ర వహిస్తాయి. దీనికోసం ఓ కప్పులో రెండు స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్, కొద్దిగా తేనె కలిపి పరగడుపున తాగాలి. ఇలా చేయడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.
మెంతులతో..
మెంతుల్లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలున్నాయి. ఫలితంగా మంచి పెయిన్ కిల్లర్‌గా పనిచేస్తుంది. ఒక స్పూన్ మెంతుల్ని రాత్రి నీళ్లలో నానబెట్టి ఉదయం పరగడుపున తీసుకోవాలి. మరోవైపు రోజుకు 1-2 సార్లు మెంతి గింజల్ని నమిలి తిన్నా ఫలితముంటుంది. ఈ పద్ధతితో కాళ్ల నొప్పుల్నించి ఉపశమనం పొందవచ్చు.
యోగాతో రిలీఫ్
రోజూ యోగా చేస్తున్నా కాళ్ల నొప్పులుండవు. యోగా చేయడం వల్ల శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపడటమే కాకుండా ఫ్లెక్సిబుల్‌గా మారుతుంది. మీక్కూడా కాళ్ల నొప్పుల సమస్య వెంటాడుతుంటే..రోజూ యోగా అలవాటు చేసుకోండి. క్రాంప్స్ తగ్గించడంలో యోగాలో బౌండ్ యాంగిల్, డాల్ఫిన్, ఈగల్ లేదా యాక్సిడెంటెడ్ సైడ్ యాంగిల్ చేస్తే ఫలితముంటుంది.
కాళ్ల నొప్పులున్నప్పుడు ఐస్ ముక్కల్ని ఓ వస్త్రంలో చుట్టి..నొప్పులున్న చోట కాపరం పెడితే నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. నేరుగా ఐస్ ముక్కల్ని రాసినా ఫరవాలేదు. హాట్ కంప్రెస్ పద్ధతి కూడా ఫలితమిస్తుంది. హాట్ వాటర్ బ్యాగ్‌తో నొప్పులున్న చోట రాస్తుంటే నొప్పి కచ్చితంగా తగ్గుతుంది.
Also read: Kidney Problems Symptoms: మీ శరీరంలోని ఆ 3 భాగాల్లో నొప్పిగా ఉందా..అయితే మీ కిడ్నీ పాడైనట్టే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook