Healthy Heart: గుండె ఆరోగ్యానికి ఏ పదార్ధాలు తినాలి, ఏవి తినకూడదు
Healthy Heart: మానవ శరీరంలోని అతి ముఖ్యమైన అంగాల్లో ఒకటి గుండె. గుండె చప్పుడు విన్పించినంతకాలమే ప్రాణం నిలబడుతుంది. ఒకసారి చప్పుడు ఆగితే ప్రాణం పోయినట్టే. అందుకే గుండెను పది కాలాలు పదిలంగా చూసుకోవాలి.
Healthy Heart: గుండెను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ఆరోగ్య నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. నిర్ణీత రూపంలో గుండె ఆరోగ్యం ఎలా ఉందనే పరీక్షలు చేయించుకోవల్సిన అవసరముంది. అదే సమయంలో గుండె ఆరోగ్యం కోసం సరైన ఆహారం తీసుకోవాలి. ఆ వివరాలు మీ కోసం..
ఆధునిక జీవనశైలి, వివిధ రకాల ఆహారపు అలవాట్లు మనిషి ఆరోగ్యంపై ప్రభావం చూపినట్టే..గుండెపై కీలక ప్రభావం చూపిస్తాయి. శరీరాన్ని సజీవంగా ఉంచేది గుండె ఒక్కటే. శరీరంలోని ధమనుల ద్వారా ఆక్సిజన్, పోషక పదార్ధాలతో నిండి ఉండే రక్తాన్ని శరీరంలోని వివిధ భాగాలకు సరఫరా చేసేది గుండె మాత్రమే. అందుకే గుండె ఆరోగ్యంపై ఎప్పుడూ ప్రత్యేక దృష్టి అవసరం. గుండె ఆరోగ్యంపై సరైన దృష్టి పెట్టడం ద్వారా గుండెను పది కాలాలపాటు పదిలంగా ఉంచుకోవచ్చు. గుండె ఆరోగ్యంగా ఉంటే శరీరంలోని ఇతర భాగాలు కూడా ప్రభావితమౌతుంటాయి.
గుండె ఆరోగ్యంగా లేకపోతే..గుండె సంబంధిత వ్యాధులైన గుండెపోటు, స్ట్రోక్ వంటివి తలెత్తడమే కాకుండా..కాకుండా శరీరంలోని ఇతర అంగాలు కూడా దెబ్బతింటుంటాయి. అందుకే నిర్ణీత పద్ధతిలో ఎప్పటికప్పుడు గుండె ఆరోగ్యం ఎలా ఉందనేది పరీక్షించుకోవాలి. ఆహారపు అలవాట్లు, వ్యాయామం చేయడం, జీవనశైలి మెరుగుపర్చుకోవడంతో పాటు నియమిత రూపంలో గుండె పరీక్షలు చేయించుకోవాలి. ఇలా చేయడం ద్వారా గుండెను సంరక్షించుకోవచ్చు. రోజూ క్రమం తప్పకుండా ఓ అరగంట వ్యాయామం చేస్తూ..ఆహారపు అలవాట్లను మార్చుకుంటే..దీర్ఘకాలం గుండెను పరిరక్షించుకోవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. రోజూ తీసుకునే ఆహారం కూడా గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తున్నందున ఏవి తినాలి ఏవి తినకూడదనేది ముందుగా తెలుసుకోవాలి.
Best Foods for Healthy Heart
చేపలు గుండె ఆరోగ్యానికి చాలా మంచివి. ఇందులో ఉండే విటమిన్ డి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్లు గుండెను పరిరక్షిస్తుంటాయి. గుండెకు ఏ విధమైన హాని చేకూరకుండా కాపాడుతాయి.
గుడ్లలో ఉండే ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ గుండెను సదా ఆరోగ్యంగా ఉంచుతాయి. హార్ట్ బీట్ సమతుల్యంగా ఉంచడమే కాకుండా రక్తపోటును నియంత్రిస్తాయి.
కూరగాయలు మరో మంచి ప్రత్యామ్నాయం. గుండె ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్, ఫైబర్ చాలా మేలు చేకూరుస్తాయి.
ఇక ఫ్రూట్స్ మొత్తం ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో పెద్దమొత్తంలో ఉండే విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ గుండెను ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.
ఫ్లక్స్ సీడ్స్ లో ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండి గుండెను సదా పరిరక్షిస్తుంటాయి.
రోజువారీ జీవన విధానంలో మనం తీసుకునే ఆహారం గుండె ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంటుంది. ఇందులో పెద్దమొత్తంలో ఉండే ట్రాన్స్ ఫ్యాట్, సోడియం వంటి పోషక పదార్ధాలు గుండెను ఇతర సమస్యల్నించి కాపాడుతుంటాయి. ఫ్రైడ్ పదార్ధాలు, చిప్స్, సాల్టెడ్ స్మాక్స్, ప్రోసెస్డ్ మీట్, ఫుడ్ ఇందులో కీలకం. ఈ పదార్ధాలు గుండెను దెబ్బతీస్తుంటాయి. ఇక మద్యం, పొగాకు గుండె ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపిస్తాయి. గుండెకు హాని చేకూరుస్తాయి.
Also read: Healthy Liver Tips: లివర్ ప్రాముఖ్యత ఏంటి, లివర్‌ను ఎలా డీటాక్స్ చేయడం ఎలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook