Healthy Liver Tips: శరీరంలో గుండె, కిడ్నీలు ఎంత ప్రాముఖ్యత కలిగినవో..లివర్ కూడా అంతే ప్రాధాన్యత కలిగింది. శరీరంలోని మలినాన్ని శుభ్రం చేసే లివర్ పరిరక్షణ చాలా అవసరం. లివర్ సంరక్షణ సరిగ్గా లేకపోతే ప్రాణాంతకం కాగలదు.
Healthy Liver Tips: లివర్‌లోని వ్యర్ధాలు శరీరంపై చెడు ప్రభావం చూపిస్తాయి. లివర్‌ను ఆరోగ్యంగా ఉంచడం చాలా అవసరం. అందుకే లివర్‌ను ఎప్పటికప్పుడు డీటాక్స్ చేస్తుండాలి. లివర్ ఆరోగ్యంగా ఉంటే ఏ విధమైన వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి. లివర్‌ను పరిశుభ్రంగా ఉంచేందుకు ఏం చేయాలో తెలుసుకుందాం..
పాలకూర లివర్ ఆరోగ్యానికి పాలకూర వంటి ఆకు కూరలు చాలా ఉపయోగకరం. ఆకుపచ్చని కూరగాయలు సేవించడం వల్ల లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో వివిధ రకాలైన కాంపౌండ్స్ ఉంటాయి. లివర్‌ను ఆరోగ్యంగా ఉంచడంలో దోహదపడతాయి
ఆరెంజ్ లివర్ ఆరోగ్యానికి ఆరెంజ్ చాలా ప్రయోజనకరం. ఎందుకంటే ఇందులో పుష్కలంగా లభించే విటమిన్ డి లివర్ డీటాక్సిఫికేషన్‌కు దోహదపడుతుంది.
గ్రీన్ టీ గ్రీన్ టీ రోజూ సేవిస్తే లివర్ ఆరోగ్యంగా ఉంటుందంటారు ఆరోగ్య నిపుణులు. గ్రీన్ టీ అనేది లివర్ డీటాక్స్ చేసేందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది.
వెల్లుల్లి వెల్లుల్లిలో సల్ఫర్ ఎక్కువ మోతాదులో లభిస్తుంది. లివర్‌ను ఆరోగ్యంగా ఉంచడంలో వెల్లుల్లి కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే రోజూ పరగడుపున 1-2 వెల్లుల్లి రెమ్మలు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.
ఆపిల్ ఆపిల్ రోజూ తినడం వల్ల లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. లివర్‌ను డీటాక్స్ చేసేందుకు ఆపిల్ అద్భుతంగా ఉపయోగపడుతుంది.