White Hair: జుట్టు తెల్లబడటం ప్రస్తుతం సాధారణ సమస్యగా మారింది. వయస్సుతో సంబంధం లేకుండా జుట్టు తెల్లబడే ఇబ్బందులు ఎక్కువౌతున్నాయి. జుట్టు తెల్లబడకుండా ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆధునిక జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లతో ఎదురౌతున్న వివిధ రకాల ఆరోగ్య సమస్యల్లో ప్రధానమైంది జుట్టు తెల్లబడటం. పని ఒత్తిడి, నిద్ర సరిగ్గా లేకపోవడం, ఆందోళన వంటి కారణాలతో వయస్సుతో సంబంధం లేకుండా 25-30 ఏళ్లకే జుట్టు తెల్లబడుతోంది. తెల్లబడిన జుట్టును నల్లగా చేసేందుకు సహజసిద్ధమైన పద్ధతులు ఎన్నో ఉన్నాయి. తెల్లజుట్టు సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు ఏం చేయాలో తెలుసుకుందాం..


హెల్తీ ఫుడ్స్


నిత్య జీవితంలో ఎదురయ్యే అన్ని రకాల అనారోగ్యాలకు కారణం చెడు ఆహారపు అలవాట్లే. జట్టు తెల్లబడటం కూడా ఇందులో ప్రధానమైంది. మార్కెట్‌లో లభించే జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ కారణంగా జుట్టుపై ప్రభావం పడుతోంది. ప్రతిరోజూ భోజనంలో విటమిన్లు, కాల్షియం, ప్రోటీన్లు, జింక్, ఐరన్, కాపర్ వంటి న్యూట్రియంట్లు ఎక్కువగా ఉండేట్టు చూసుకోండి.


స్మోకింగ్ నిషిద్దం


సిగరెట్, బీడీ, హుక్కా వంటి వస్తువులు ఆరోగ్యానికి మంచిది కాదు. సిగరెట్ పొగ ఊపిరితిత్తుల్ని డ్యామేజ్ చేస్తుంది. ధూమపానం వల్ల జుట్టు త్వరగా తెల్లబడేందుకు పూర్తి అవకాశాలున్నాయి. యువతీ యువకుల చెడు అలవాట్లే జుట్టు నెరిసిపోవడానికి కారణమౌతోంది. ఒత్తిడి అనేది చాలా ప్రమాదకరం. ఎందుకంటే మెదడు ఆరోగ్యంగా లేకపోతే శరీరం ఆరోగ్యంగా ఉండదు. మెదడు పనితీరుని బట్టే అన్నీ ఆధారపడి ఉంటాయి. ఎక్కువగా ఒత్తిడికి లోనవడం కూడా జుట్టు తెల్లబడేందుకు కారణం. అందుకే ఒత్తిడికి దూరంగా ఉండాలి.


శరీరంలో థైరోక్సిన్ హార్మోన్ అవసరానికి మించి విడుదలైతే తెల్ల జుట్టు సమస్య ఎదురౌతుంది. హైపో థైరాయిడిజమ్ సమస్య ఉండేవారికి ధైరోక్సిన్ హార్మోన్ మోతాదుకు మించి విడుదలౌతుంది. 


Also read: World Hepatitis Day 2022: ఇవాళ వరల్డ్ హెపటైటిస్ డే.. అసలు హెపటైటిస్ అంటే ఏమిటి, ఎందుకు వస్తుంది, ఎలా గుర్తించాలి..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి