World Hepatitis Day 2022: ఇవాళ వరల్డ్ హెపటైటిస్ డే. ప్రతీ ఏటా జూలై 28వ తేదీని ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెపటైటిస్ డేగా నిర్వహిస్తోంది. హెపటైటిస్ పట్ల అవగాహన కల్పించడం, దాని నివారణకు అవసరమయ్యే చర్యలను ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్దేశం. అసలు హెపటైటిస్ అంటే ఏమిటి.. ఇందులో ఎన్ని రకాలు ఉన్నాయి.. ఈ వ్యాధి ప్రాణాంతకమా.. తదితర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం...
హెపటైటిస్ అంటే ఏమిటి :
హెపటైటిస్ అంటే కాలేయ వాపు. ఇందులో ఐదు రకాలు ఉన్నాయి. హెపటైటిస్-ఏ,బీ,సీ,డీ,ఈ. ఇందులో హెపటైటిస్ బీ, సీ దీర్ఘకాలిక వ్యాధులు. మిగతావాటితో పోలిస్తే ఈ వ్యాధుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది హెపటైటిస్ బీ,సీలతో బాధడుతున్నారు. హెపటైటిస్ కారణంగా ఏటా 10 లక్షల మంది చనిపోతున్నారంటే ఈ వ్యాధి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. హెపటైటిస్‌కి ప్రత్యేక చికిత్సా విధానం అంటూ ఏదీ అందుబాటులో లేదు. హెపటైటిస్ చికిత్సకు యాంటీ వైరల్ మందులు, ఇంజెక్షన్స్ ఉపయోగిస్తారు.
హెపటైటిస్ కారణాలేంటి :
అధికంగా ఆల్కాహాల్ తీసుకోవడం, టాక్సిన్స్, కొన్ని రకాల మందులు తదితర కారణాలతో హెపటైటిస్ బారినపడే అవకాశం ఉంటుంది. హెపటైటిస్ సోకిన వ్యక్తుల రక్తం, వీర్యం, స్రావాల ద్వారా ఇది ఇతరులకు వ్యాప్తి చెందుతుంది.
హెపటైటిస్ లక్షణాలు :
నీరసం
జ్వరం
ఆకలి లేకపోవడం
బక్కచిక్కిపోవడం
పచ్చ కామెర్లు
కీళ్ల నొప్పి, పొత్తి కడుపులో నొప్పి
మూత్రం ముదురు రంగులో రావడం
ఈ లక్షణాలు ఉన్నట్లయితే హెపటైటిస్ ఉందేమోనని అనుమానించాల్సి ఉంటుంది. హెపటైటిస్ వ్యాధిని త్వరగా గుర్తించి వైద్యుల సూచన మేరకు మందులు వాడినట్లయితే వ్యాధి నుంచి బయటపడవచ్చు. లేనిపక్షంలో అది ప్రాణాలకే ముప్పు తీసుకువచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ సంవత్సరం డబ్ల్యూహెచ్ఓ 'మీ చెంతకే హెపటైటిస్ కేర్' అనే థీమ్‌తో వరల్డ్ హెపటైటిస్ డేని నిర్వహిస్తోంది.
Also Read: Monkeypox Cases: ఆ లైంగిక సంబంధాలు కలిగిన పురుషులకు డబ్ల్యూహెచ్ఓ కీలక విజ్ఞప్తి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి