Cholesterol Diet: కొలెస్ట్రాల్ ఎలా గుర్తించాలి, తగ్గించేందుకు తినే ఆహార పదార్ధాలు
Cholesterol Diet: ఆధునిక జీవనశైలి కారణంగా ఎదురవుతున్న వ్యాధుల్లో ఒకటి హై కొలెస్ట్రాల్ ఒకటి. కొలెస్ట్రాల్ ఎలా గుర్తించాలి, ఆహారపు అలవాట్లను ఎలా మార్చుకోవాలనేది తెలుసుకుందాం..
Cholesterol Diet: ఆధునిక జీవనశైలి కారణంగా ఎదురవుతున్న వ్యాధుల్లో ఒకటి హై కొలెస్ట్రాల్ ఒకటి. కొలెస్ట్రాల్ ఎలా గుర్తించాలి, ఆహారపు అలవాట్లను ఎలా మార్చుకోవాలనేది తెలుసుకుందాం..
శరీరానికి కొలెస్ట్రాల్ అవసరమే కానీ..మోతాదుకు మించి ఉండకూడదు. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. కొలెస్ట్రాల్ ఎక్కువైతే పలు గంభీరమైన వ్యాధులు తలెత్తుతాయి. కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వంటి వ్యాధుల ముప్పు ఎక్కువగా ఉంటుంది. జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేస్తే..కొలెస్ట్రాల్ తగ్గించుకోవచ్చు.
చెడు కొలెస్ట్రాల్ ఉన్నప్పుడు శరీరం నుంచి వెలువడే కొన్ని సంకేతాలతో సులభంగా గుర్తించవచ్చు. కొలెస్ట్రాల్ ఎక్కువైతే కాళ్లలో నొప్పులు, తీవ్రమైన అలసట, నడక కష్టంగా మారడం వంటివి కన్పిస్తాయి. కాళ్లు తిమ్మిరిగా ఉండటం, గోర్లు త్వరగా పెరగకపోవడం, కాళ్లు పసుపుగా మారడం వంటివి ప్రధాన లక్షణాలు.
చెడు కొలెస్ట్రాల్ తగ్గించేందుకు ఎక్కువగా పండ్లు, కూరగాయలు, తృణ ధాన్యాలు తినాల్సి ఉంటుంది. జంక్ ఫుడ్ తినకూడదు. ఫ్యాట్ ఎక్కువగా ఉంటే ఆహార పదార్ధాలు తీసుకోకూడదు. స్మోకింగ్ మానకూడదు. క్రమం తప్పకుండా ఎక్సర్ సైజ్, యోగా వంటివి అలవాటు చేసుకోవాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook