Viral Fevers: వర్షాకాలం వచ్చిందంటే చాలు సీజనల్ వ్యాధుల ముప్పు అధికమౌతుంది. వైరల్ జ్వరాలు పీడిస్తుంంటాయి. వర్షాకాలంలో వైరల్ జ్వరాలకు కారణమేంటి, ఏ విధంగా సంరక్షించుకోవాలో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అడపా దడపా వర్షాలతో వర్షాకాలం ఆహ్లాదంగానే ఉన్నా..సీజనల్ వ్యాధులు, ఇన్‌ఫెక్షన్ల బెడద ఎక్కువగా ఉంటుంది. వర్షాకాలంలో వైరల్, బ్యాక్టీరియాలు యాక్టివ్‌గా ఉండటం వల్ల వ్యాధులు త్వరగా వ్యాపిస్తాయి. జలుబు, జ్వరం, దగ్గు వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. జ్వరాలు ఎక్కువగా ఇబ్బందిగా మారుతాయి. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండేవారికి మరింత ఇబ్బంది. వర్షాకాలంలో కొత్త కొత్త వ్యాధులు, జ్వరాలు విస్తరిస్తుంటాయి. వీటికి కారకమైన వైరస్, బ్యాక్టీరియా యాక్టివ్‌గా ఉండటం వల్ల వైరల్ జ్వరాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వైరల్ జ్వరం లక్షణాలు ఎలా ఉంటాయి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలో పరిశీలిద్దాం.


వర్షాకాలంలో జ్వరం, దగ్గు, జలుబు, గొంతు పచ్చిగా ఉండటం, వాంతులు, కడుపు నొప్పి వంటి లక్షణాలు కన్పిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. 


వేడి కారణంగా జ్వరాన్ని వ్యాపింపజేసే క్రిమికీటకాలు పుడుతుంటాయి. అందుకే తరచూ ఆవిరి తీసుకోవడం చాలా మంచిది. జలుబు లేదా జ్వరం, తుమ్ములు, దగ్గు ఉన్నప్పుడు టిష్యూ పేపర్ తప్పకుండా వినియోగించాలి. సాధ్యమైనంతవరకూ శానిటైజర్ ఉపయోగించడం అలవాటు చేసుకోవాలి. లేదా వేడి నీళ్లు, సబ్బుతో కాళ్లు చేతులు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఇంట్లో ప్రతిరోజూ వేపాకు పొగ వేయడం మంచిది. దీనివల్ల జ్వరాన్ని వ్యాపింపజేసే దోమలు అంతమౌతాయి.


వర్షాకాలంలో ఏం తినాలి


రోగ నిరోధక శక్తిని పెంచే పండ్లు ఎక్కువగా తినాలి. విటమిన్ సి పుష్కలంగా ఉండే నారింజ, బత్తాయి ఎక్కువగా తీసుకోవడం వల్ల క్రిములతో పోరాడే శక్తి వస్తుంది. జలుబు వంటి సమస్యలున్నప్పుడు మాత్రం బత్తాయి వంటి చలవచేసే పండ్లు తీసుకోకూడదు. వర్షాకాలంలో వీలైనంతవరకూ వేడి చేసిన నీళ్లు తాగడం మంచిది. ఆహారంలో చలవ చేసేటివి కాకుండా వేడి చేసే పదార్ధాలు సేవించాలి. అలాగని మసాలా పదార్ధాలు కూడా మంచిది కాదు. పసుపు, సొంఠి, అల్లం, లవంగ, వాము, ఇంగువ, బెల్లం వంటి వేడి చేసే పదార్ధాలు ఎక్కువగా తీసుకోవాలి.


ఆకుపచ్చ కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. వెల్లుల్లి ప్రతిరోజూ తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. ఇందులో ఉండే మెగ్నీషియం, ఫాస్పరస్ ఆరోగ్యానికి మంచిది. యాపిల్, అరటి పండ్లు, బత్తాయి వంటి పండ్లు తీసుకోవాలి. టమోటా, బంగాళదుంపు కూడా మంచిది. 


Also read: Weight Loss Tips: కరివేపాకుతో కూడా బరువు తగ్గొచ్చు.. ఎలానో తెలుసా..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook