Indigestion Reasons: అజీర్తి అనేది ఇటీవలి కాలంలో చాలా ఎక్కువగా కన్పిస్తోంది. ఆదునిక జీవన విధానంలో పడి ఆహారపు అలవాట్లను సరిగ్గా పాటించకపోవడంతో ఈ సమస్య తలెత్తుతోంది. చాలామంది ఈ సమస్యతో బాధపడుతుంటారు. ప్రతి ఒక్కరికీ ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలని ఉంటుంది. అసలు ఈ సమస్యకు కారణమేంటో పరిశీలిద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మనం తిన్న ఆహారం సక్రమంగా జీర్ణం కాకపోతే అజీర్తి సమస్య తలెత్తుతుంది. కడుపులో నొప్పి, కడుపులో అసౌకర్యంగా ఉండటం లేదా బరువుగా ఉండటం వంటి సమస్యలు ఉత్పన్నమౌతాయి. స్వెల్లింగ్, తేన్పులు, మలబద్ధకం, వాంతులు, గ్యాస్ వంటి సమస్యలకు దారితీస్తుంది. ఈ పరిస్థితి పది ముఖ్యమైన కారణాలున్నాయి. వీటిని దూరం పెడితే ఇక అజీర్తి సమస్యే తలెత్తదు. 


గాల్ బ్లేడర్ స్టోన్స్ కారణంగా బాయిల్ డక్ట్ బ్లాక్ అవుతుంది. ఫలితంగా అజీర్తి, కడుపులో నొప్పి ప్రారంభమౌతుంది. అందుకే ఈ సమస్యకు ముందుగా చెక్ పెట్టాలి. మానసిక స్థితి సరిగ్గా లేకపోయినా కడుపుపై ఆ ప్రభావం పడుతుంది. ఒత్తిడి, ఆందోళన కారణంగా అజీర్తి సమస్య రావచ్చు. అందుకే ఈ రెండు సమస్యల్ని దూరం చేయాలి.


సిగరెట్, బీడీ, హుక్కా, గంజాయి తాగే అలవాటుంటే వెంటనే మానేయాలి. ఎందుకంటే ఈ చెడు అలవాట్లు కడుపులో సమస్యగా మారుతాయి. కొన్ని రకాల మందులు కూడా కడుపులో సమస్యకు కారణమౌతాయి. ఇందులో నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మందులున్నాయి. వీటిని ఇష్టారాజ్యంగా వాడకూడదు. 


పెప్టిక్ అల్సర్ లేదా కడుపులో గాయాలు అజీర్తికి కారణమౌతాయి. ప్రత్యేకించి తిన్న తరువాత ఈ పరిస్థితి ఉంటుంది. భారతీయుల్లో చాలామందికి టీ, కాఫీ తాగడం అలవాటు. వీటిలో మోతాదుకు మించి కెఫీన్ ఉంటుంది. ఫలితంగా మలబద్ధకం సమస్య ఉత్పన్నమౌతుంది. 


మద్యం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచితి కాదు. ఇక కడుపు ఆరోగ్యానికైతే చాలా హాని కల్గిస్తుంది. మద్యం అలవాటు వల్ల యాసిడ్ గొంతులోకి వస్తుంటుంది. ఫలితంగా అజీర్తి, గుండె మంట సమస్యలు వస్తాయి. మసాలా పదార్ధాలు, మిర్చి అతిగా తినడం వల్ల కడుపులో మంట పుడుతుంది. ఫలితంగా ఇది అజీర్తికి కారణమౌతుంది. 


ఆకలేసినప్పుడు అతిగా తినడం లేదా వేగంగా తినడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు ఉత్పన్నమౌతాయి. ఎందుకంటే ఈ అలవాటు జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. కొంతమంది అదే పనిగా ఎసిడిక్ ఆహార పదార్ధాలు లేదా డ్రింక్స్ ఎక్కువగా తీసుకుంటారు. ఇలా చేయడం వల్ల కడుపులో యాసిడ్ ఉత్పత్తి పెరిగి అజీర్తికి కారణమౌతుంది.


Also read: Weight Loss Drink: ఈ 3 టీలతో బరువు తగ్గడమే కాదు..శరీరంలోని కొలెస్ట్రాల్‌ను కూడా 7 రోజుల్లో కరిగించుకోవచ్చు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook