Health Tips: వాము నీటిలో నిమ్మరసం పిండి తాగితే...మరణం తప్ప అన్నింటికీ చెక్
Health Tips: ప్రకృతిలో విరివిగా లభించే వస్తువుల్లో..ప్రత్యేకించి ప్రతి కిచెన్‌లో ఉండే పదార్ధాల్లో మెరుగైన ఆరోగ్యానికి కావల్సిన ఎన్నో పోషకాలుంటాయి. ఇవి ప్రతిరోజూ డైట్లో ఉండేట్టు చూసుకుంటే ఎలాంటి అనారోగ్యం దరిచేరదంటున్నారు ఆరోగ్య నిపుణులు.
Health Tips: ప్రతి భారతీయ కిచెన్‌లో తప్పకుండా లభించే వస్తువు వాము. ఇది ఓ రకమైన మసాలా దినుసు. చాలామందికి తెలియని విషయమేంటంటే వాముతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయని. రోజూ పరగడుపున వాము తీసుకుంటే కలిగే ప్రయోజనాలు వింటే నోరెళ్లబెట్టడం ఖాయం.
ప్రతిరోజూ ఉదయం లేచిన వెంటనే పరగడుపున వాము నీళ్లలో కొద్దిగా నిమ్మరసం పిండుకుని తాగితే ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. ఎలాంటి అనారోగ్యం దరిచేరదు. స్థూలకాయం నుంచి విముక్తి పొందవచ్చు. శరీరాన్ని అద్భుతంగా డీటాక్స్ చేసుకోవచ్చు. ఇందులో ఉండే యాంటీ వైరల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలతో చాలా సమస్యలకు చెక్ పెట్టవచ్చు. మరీ ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. ఒకే ఒక్క చెంచా వాము చాలు ఆరోగ్యాన్ని పూర్తిగా సంరక్షించేందుకు.
ప్రతి రోజూ పరగడుపున వాము నీళ్లలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగడం అలవాటు చేసుకుంటే మీ బరువు చాలా త్వరగా తగ్గిపోతుంది. దీనివల్ల పీరియడ్స్ సమయంంలో తలెత్తే నొప్పులు కూడా దూరమౌతాయి. మరోవైపు రక్త సరఫరా కూడా మెరుగుపడుతుంది. పొట్ట, నడుము చుట్టూ ఉండే కొవ్వు కరుగుతుంది.
వాము నిమ్మరసం నీళ్లు రోజూ తాగితే శరీరంలోని అన్ని రకాల విష పదార్ధాలు బయటకు తొలగిపోతాయి. అంటే ఈ నీళ్లు బెస్ట్ డీటాక్స్ డ్రింక్‌గా పనిచేస్తాయి. రోజూ పరగడుపున వాము నీళ్లలో కొద్దిగా నిమ్మరసం కలిపి తాగితే చర్మ సంబంధ సమస్యలు దూరమౌతాయి. చర్మాన్ని ఆరోగ్యంగా మార్చుతాయి. అదే సమయంలో ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది.
వాము ఆరోగ్యానికి చాలా మంచిది. ఆయుర్వేద శాస్త్రంలో వాముకు చాలా ప్రాదాన్యత , విశిష్టత ఉన్నాయి. వాములో థయమాల్, ఫైబర్ వంటి పోషకాలు చాలా ఎక్కువ పరిమాణంలో ఉంటాయి. ఫలితంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఏర్పడకుండా నియంత్రించడంతో దోహదమౌతుంది. రోజూ వాము నీటిలో కొద్దిగా నిమ్మరసం కలిపి తాగడం వల్ల గుండె సంబంధిత రోగాలు దూరం చేయవచ్చు. రక్త సరఫరా నియంత్రణలో ఉంటుంది. ఎలాంటి అనారోగ్య సమస్య దాదాపుగా ఉండదనే చెప్పవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook