Cheese Benefits: పాలను కంప్లీట్ ఫుడ్‌గా పిలుస్తారు. కారణం ఇందులో ఉండే విభిన్న రకాల పోషక పదార్ధాలు. ఆరోగ్యాన్ని పూర్తిగా సంరక్షించేందుకు ఇవి దోహదపడతాయి. అటు పాల ఉత్పత్తులు కూడా అంతే స్థాయిలో ఆరోగ్యాన్ని తీర్చిదిద్దుతాయి. ఆ వివరాలు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పాల ఉత్పత్తుల్లో అత్యుత్తమమైంది చీజ్. చాలామంది ఆరోగ్యానికి ఇది మంచిది కాదనే అభిప్రాయంలో ఉంటారు. కానీ ఇది పూర్తిగా అవాస్తవం. ఆరోగ్యానికి చీజ్ చేసే మేలు చాలా ఎక్కువ. పాలు ఒక్కటే కాదు పాలతో తయారైన చాలా వస్తువులు ఆరోగ్యానికి మేలు చేకూర్చేవే. ఇటీవలి కాలంలో చీజ్ వినియోగం పెరుగుతోంది. ముఖ్యంగా శాండ్‌విచ్, పాస్తా, పిజ్జా, బర్గర్‌లలో విరివిగా ఉపయోగిస్తున్నారు. చాలామంది తెలియక చీజ్‌ను అన్‌హెల్తీ ఫుడ్‌గా పరిగణిస్తారు. కానీ చీజ్ చాలా హెల్తీ ఫుడ్. ఇందులో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండి, కాల్షియం, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి.


చీజ్ ప్రయోజనాలు


కొంతమందికి వైద్యులు కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండే పదార్ధాలు తీసుకోమని సూచిస్తుంటారు. అటువంటి వాళ్లు చీజ్ తినడం చాలా మంచిది. చీజ్ అనేది శరీరంలోని ఎముకల్ని పటిష్టం చేస్తుంది. ఎందుకంటే ఇందులో కాల్షియం, ప్రోటీన్లు పెద్దమొత్తంలో లభిస్తాయి. చీజ్ తినే మార్గాలు చాలానే ఉన్నాయి. కానీ బ్యాలెన్స్ డైట్‌గా తీసుకుంటే అన్ని విధాలా మంచిది. 


ప్రతిరోజూ సలాడ్ తినే అలవాటుంటే అందులో చీజ్ కలుపుకుని తింటే రుచి పెరుగుతుంది. దీనికోసం టొమాటో, పాయసం, ఉల్లిపాయలు, ముల్లంగిలను ముక్కలుగా కోసుకుని అందులో చీజ్ కలుపుకుని తింటే బాగుంటుంది.


గుడ్లు తినే అలవాటుంటే..చాలా మంచిది. ఎందుకంటే ఇదొక ప్రోటీన్ ఫుడ్. గుడ్డులో చీజ్ కలుపుకుని తింటే హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ సిద్ధమైనట్టే. దీనివల్ల శరీరానికి కావల్సిన పోషకాలు పరిపూర్ణంగా లభిస్తాయి.


సాధారణంగా బ్రేక్‌ఫాస్ట్‌లో వేర్వేరు రకాల పరాఠాలు తింటుంటాము. ఇవే పరోఠాలకు కొద్దిగా చీజ్ కలిపి తింటే రుచి పెరగడమే కాకుండా మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.


ఉదయం వేళ బ్రేక్‌ఫాస్ట్‌గా శాండ్‌విచ్ తినడం ఇటీవలి కాలంలో చాలా ఎక్కువైంది. ఇందులో చీజ్ కలుపుకుని తింటే ఇంకా మంచిది. రుచితో పాటు ఆరోగ్యం కూడా ఉంటుంది.


Also read: Summer Drinks: వేసవిలో రోజూ ఈ డ్రింక్ తాగితే కలిగే లాభాలు తెలిస్తే జీవితంలో వదిలిపెట్టరిక



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook