Coconut Vinegar: కొబ్బరి అనుబంధంగా చాలా పదార్ధాలుంటాయి. కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె, కొబ్బరి పాలు ఇవన్నీ అందరికీ తెలిసిందే. అయితే కోకోనట్ వెనిగర్ గురించి చాలా తక్కువ మందికి తెలిసుంటుంది. ఇది కూడా ఆరోగ్యానికి చాలా లాభదాయకంగా ఉంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొబ్బరితో ఆరోగ్యపరంగా అద్బుత ప్రయోజనాలున్నందున దీనికి సూపర్ ఫుడ్ అని పిలుస్తుంటారు. అందుకే మార్కెట్‌లో కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె, కొబ్బరి పాలకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. చాలా వంటల్లో పెద్దఎత్తున వినియోగిస్తుంటారు. అలాంటిదే కోకోనట్ వెనిగర్. దక్షిణ తూర్పు ఆసియాలో కోకోనట్ వెనిగర్ ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇదొక ఎసిడిక్ మసాలా. కొబ్బరి పూలతో ఇది తయారౌతుంది. ఇదొక ఫర్మంటెడ్ ఉత్పత్తి అయినందున సహజసిద్ధమైన సూపర్ ఫుడ్, ప్రోబయోటిక్ సోర్స్‌గా పరిగణించవచ్చు. కడుపును ఆరోగ్యంగా ఉంచుతుంది. బీ కాంప్లెక్స్ విటమిన్, అమైనో యాసిడ్స్ కూడా పుష్కలంగా లభిస్తాయి. దీనివల్ల మనిషి ఇమ్యూనిటీ అద్బుతంగా పెరుగుతుంది. మలబద్ధకం నుంచి విముక్తి పొందుతుంది. ఇందులో కేలరీలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సాస్, సూప్, సలాడ్‌లలో ఉపయోగిస్తారు. 


బ్లడ్ షుగర్ నియంత్రణ


కోకోనట్ వెనిగర్‌లో ఎసిడిక్ యాసిడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మనిషి శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్ తగ్గించేందుకు లేదా నియంత్రణలో ఉంచేందుకు అద్బుతంగా ఉపయోగపడుతుంది. టైప్ 2 డయాబెటిస్ రోగులకు చాలా బాగా పనిచేస్తుంది. అద్బుతమైన ఉపశమనం అందిస్తుంది. అందుకే మధుమేహం వ్యాధిగ్రస్థులకు కోకోనట్ వెనిగర్ అనేది ఓ వరం లాంటిదని చెప్పవచ్చు. అయితే క్రమం తప్పకుండా తీసుకోవల్సి ఉంటుంది. 


అధిక బరువుకు చెక్


కోకోనట్ వెనిగర్ బరువు తగ్గించేందుకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ తగ్గిస్తుంది. బరువు పెరగడానికి కారణంగా ఈ ఇన్‌ఫ్లమేషనే. ఇందులో ఎసిడిక్ యాసిడ్ పుష్కలంగా ఉండటం వల్ల ఆకలి నియంత్రణలో ఉంటుంది. ఆకలి దూరమౌతుంది. ఫలితంగా క్రమ క్రమంగా బరువు తగ్గుతుంది. 


మెరుగైన జీర్ణ వ్యవస్థ


కోకోనట్ వెనిగర్ అద్భుతమైన జీర్ణవ్యవస్థకు తోడ్పడే అతి ముఖ్యమైన పదార్ధం. రోగ నిరోధక శక్తిని వేగవంతంగా పెంచుతుంది. పర్మంటేషన్ ప్రక్రియ సహజంగా ఉంటుంది. ప్రో బయోటిక్స్ ఉండటం వల్ల కడుపు ఎప్పటికీ ఆరోగ్యంగా ఉంటుంది. చాలా రకాల వైరస్, బ్యాక్టీరియాలను ఇది దూరం చేస్తుంది. 


Also read: Kiwi Health Benefits: కివీ తినడం వల్ల ప్లేట్‌లెట్స్ మాత్రమే కాదు ఈ ఐదు సమస్యలకు చెక్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook