Health Tips: రోజూ ఈ నీళ్లు తాగితే కేవలం 5 వారాల్లో 5 కిలోల బరువు తగ్గడం ఖాయం
Health Tips: ఆధునిక జీవన విధానంలో అధిక బరువు పెను సమస్యగా మారింది. బరువు తగ్గించుకునేందుకు వివిధ రకాలుగా ప్రయత్నించి విఫలమౌతుంటారు. కొన్ని చిట్కాలు పాటిస్తే అద్భుతంగా తగ్గించవచ్చంటున్నారు.
Health Tips: స్థూలకాయం అతి పెద్ద సమస్య. స్థూలకాయం సమస్యను వెంటనే పరిష్కరించకపోతే ఇతర అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. అయితే ఆయుర్వేద శాస్త్రంలో కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు.
ప్రతి భారతీయుడి ఇంట్లో తప్పకుండా లభించే పదార్ధం జీలకర్ర. జీలకర్రలో కేవలం ఆరోగ్యపరమైన ప్రయోజనాలే కాకుండా అధిక బరువు సమస్యను పోగొట్టేందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. జీలకర్ర నీళ్లు బరువు తగ్గించే ప్రక్రియకు ఉపయోగపడతాయి. పొట్ట, నడుము చుట్టూ ఉండే కొవ్వు సులభంగా కరిగిపోతుంది. వాస్తవానికి బరువు తగ్గించుకోవాలని చాలామందికి ఉంటుంది కానీ సరైన పద్ధతులు తెలియక ఇబ్బందులు పడుతున్నారు.
రోజూ రాత్రి సమయంలో ఒక టీ స్పూన్ జీలకర్రను నానబెట్టి ఉదయం పరగడుపున ఆ నీటిని సేవించాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలుంటాయి. చర్మం నిగనిగలాడుతుంటుంది. జీలకర్ర నీళ్లు రోజూ తాగడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. మనం తినే ఆహారం ద్వారా పేరుకుపోయే కొవ్వు పదార్ధాలు పూర్తిగా తొలగిపోతాయి. ముఖ్యంగా శరీరంలో ఉండే విష పదార్ధాలు పూర్తిగా తొలగిపోతాయి. లివర్ పూర్తి ఆరోగ్యంగా ఉంటుంది.
జీలకర్రలోని కొన్ని రకాల ఔషధ గుణాల కారణంగా శరీరంలో అన్ని అవయవాలు సక్రమంగా పనిచేసేందుకు దోహదమౌతుంది. ముఖ్యంగా ఊపిరితిత్తుల ఆరోగ్యంగా పనిచేస్తాయి. శ్వాస సంబంధ సమస్యలుంటే తొలగిపోతాయి. ఆహారం కాస్తా పేగుల్లో పేరుకుని వివిధ రకాల అనారోగ్య సమస్యకు దారితీస్తుంది. జీలకర్రలో ఫైబర్ పెద్దమొత్తంలో ఉండటం వల్ల కడుపు నిండుగా ఉన్నట్టుంటుంది. దాంతో ఆకలి నియంత్రణలో ఉంటుంది. శరీరంలో చెడు కొవ్వును జీరకర్ర నీళ్లు చాలా సులభంగా కరిగిస్తాయి.
ఇక మరోవైపు మెంతి గింజలు కూడా బరువు తగ్గేందుకు, నడుము, పొట్ట చుట్టూ కొవ్వు కరిగించేందుకు అద్భుతంగా ఉపయోగపడతాయి. దీనికోసం మెంతిగింజల్ని నీళ్లలో నానబెట్టి ఉదయం తాగడం వల్ల మంచి ఫలితాలుంటాయి.
Also read: UTI Problem: యూరినరీ ట్రాక్ ఇన్‌ఫెక్షన్‌కు కారణాలేంటి, ఈ సమస్య నుంచి ఎలా ఉపశమనం పొందాలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook