Curd Benefits: పెరుగులో ఈ నాలుగు పదార్ధాలు కలిపి తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలకు లెక్కే లేదు
Curd Benefits: శరీరానికి పెరుగు చాలామంచిది. ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. పెరుగులో ఉండే వివిధ రకాల పోషకాలు సంపూర్ణ ఆరోగ్యానికి తోడ్పడుతాయి. అదే సమయంలో పెరుగులో కొన్ని రకాల వస్తువులు కలిపి తీసుకుంటే ఆరోగ్యం రెట్టింపు అవుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.
Curd Benefits: మనిషి ఆరోగ్యాన్ని నిర్ణయించేంది ఆహార పదార్ధాలే. మనం రోజూ తీసుకునే ఆహారం ఆరోగ్యంగా ఉంటే కచ్చితంగా ఆరోగ్యం సక్రమంగా ఉంటుంది. ఆరోగ్యానికి కారణమయ్యే వివిద రకాల పదార్ధాల్లో పెరుగు ఒకటి. ఇందులో ఉండే పోషకాల కారణంగా ఆరోగ్యం సదా బాగుంటుంది. అందుకే పెరుగును ఎప్పటికీ నిర్లక్ష్యం చేయకూడదు.
వాస్తవానికి పాల ఉత్పత్తులు అన్నీ ఆరోగ్యానికి మేలు చేకూర్చేవే. పాలలో కాల్షియం, ప్రోటీన్, విటమిన్ బి12, మెగ్నీషియం, పొటాషియంతో పాటు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కావల్సినన్ని ఉంటాయి. ముఖ్యంగా చలికాలంలో కొన్ని వస్తువుల్ని పెరుగులో కలిపి తీసుకోవడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. కడుపు సంబంంధిత చాలా సమస్యలకు పెరుగు సరైన సమాధాననం.
సాధారణంగా వేసవిలో పెరుగు తప్పకుండా తీసుకుంటుంటారు. శరీరానికి చలవ చేస్తుంది. చలికాలంలో పెరుగు తినడం వల్ల దగ్గు, జలుబు వంచి సమస్యలు ఉత్పన్నం కావచ్చు. అయితే కొన్ని రకాల పదార్ధాలు కలిపి తీసుకోవడం వల్ల పెరుగు శీతాకాలంలో తీసుకున్నా ఏమీ కాదు.
దాల్చిన చెక్క పౌడర్
దాల్చినచెక్కలో యాంటీ ఫంగల్, యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరయల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలుంటాయి. ఫలితంగా శీతాకాలంలో ఉత్పన్నమయ్యే వ్యాధుల్నించి రక్షణ లభిస్తుంది. అందుకే శీతాకాలంలో పెరుగు తినాలనుకున్నప్పుడు కొద్దిగా దాల్చినచెక్క పౌడర్ కలుపుకుని తాగితే చలికాలపు సమస్యలు రాకపోవచ్చు.
ఫ్రైడ్ జీలకర్ర పౌడర్
జీలకర్ర ఆరోగ్యానికి చాలా మంచిది. శీతాకాలంలో పెరుగులో జీలకర్ర పౌడర్ కలుపుకుని తాగడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హాని కలగదు. ఎందుకంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కావల్సినంతగా ఉంటాయి. స్వెల్లింగ్ సమస్య కూా దూరమౌతుంది.
నల్ల ఇలాచీ పౌడర్
నల్ల ఇలాచీ చాలా అరుదుగా వినియోగిస్తారు. దీని స్వభావం వేడిమి. ఇది తీసుకోవడం వల్ల వాంతులు, అజీర్తి, కడుపు నొప్పి సమస్యలు దూరమౌతాయి. పెరుగు లేదా మజ్జిగలో కొద్దిగా నల్ల ఇలాచీ పౌడర్ కలుపుకుని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది.
లవంగం పౌడర్
లవంగంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. దీనివల్ల ఎముకలు, దంతాలు, గోర్లు బలంగా మారతాయి. పెరుగులో ఈ పౌడర్ కలుపుకుని తాగితే శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి.
Also read: Bone Health: మీ ఎముకలు ఉక్కులా ధృడంగా మారాలంటే రోజూ ఈ 5 డ్రింక్స్ తాగాల్సిందే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook