Bone Health: మీ ఎముకలు ఉక్కులా ధృడంగా మారాలంటే రోజూ ఈ 5 డ్రింక్స్ తాగాల్సిందే

Bone Health: శరీరాన్ని ఫిట్ అండ్ హెల్తీగా ఉంచడంలో ఎముకల కీలకపాత్ర పోషిస్తాయి. వయస్సు పెరిగినా ఎముకల్లో పటుత్వం ఉంటే శరీర సౌష్ఠవం సక్రమంగా ఉంటుంది. లేకపోతే వయస్సుతో పాటు వచ్చే లక్షణాలు కన్పిస్తుంటాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 15, 2023, 05:00 PM IST
Bone Health: మీ ఎముకలు ఉక్కులా ధృడంగా మారాలంటే రోజూ ఈ 5 డ్రింక్స్ తాగాల్సిందే

Bone Health: మనం తీసుకునే ఆహార పదార్ధాలపై ఆరోగ్యం, ఫిట్నెస్ ఆధారపడి ఉంటాయి. ఆధునిక జీవనశైలిలో వివిధ రకాల చెడు ఆహారపు అలవాట్ల కారణంగా శరీరం ఫిట్నెస్ కోల్పోవడమే కాకుండా అనారోగ్యం బారినపడుతుంటాం. ఈ సమస్యకు సమాధానం మన ఆహారపు అలవాట్లలోనే ఉంది. 

శరీరాన్ని ఫిట్‌గా ఉంచేందుకు చాలా అంశాలు తోడ్పడుతుంటాయి. డైట్‌తో పాటు పోషకాలు సమృద్ధిగా ఉండే ఆహారం అవసరమౌతుంది. లేకపోతే వయస్సుతో పాటు శరీరంలో చాలా రకాల సమస్యలు ఎదురౌతుంటాయి. అందులో ప్రధాన సమస్య ఎముకల బలహీనత లేదా ఎముకలు పటుత్వం కోల్పోవడం. ఎముకలు పటుత్వం కోల్పోవడం వల్ల చాలా రకాల సమస్యలు తలెత్తుతుంటాయి. ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే హెల్తీ డైట్ తప్పనిసరిగా ఉండాలి. దీనికి ప్రధానంగా విటమిన్ డి, కాల్షియం ఉండే ఆహార పదార్ధాలు డైట్‌లో ఉండేలా చేసుకోవాలి. ఇది పెద్ద కష్టమైందేమీ కాదు. ఎముకలు పటుత్వం కోల్పోకుండా ఉండే కొన్ని రుచికరమైన డ్రింక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పైనాపిల్ జ్యూస్‌లో పెద్దమొత్తంలో కాల్షియం, మినరల్స్ ఉంటాయి. దీనివల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. రోజూ ఉదయం బ్రేక్‌ఫాస్ట్ వేళ పైనాపిల్ జ్యూస్ తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఎముకలకు బలం చేకూరుతుంది. ఇక మరో అద్భుతమై డ్రింక్ ఆరెంజ్ జ్యూస్. ఇందులో విటమిన్ సి పెద్దమొత్తంలో ఉంటుంది. కాల్షియం కూడా కావల్సినంతగా లభిస్తుంది. ఎముకలు బలంగా ఉండేందుకు దోహదం చేస్తుంది. రోజూ ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హాని కలగదు. 

ఎముకలు బలంగా ఉండేందుకు చాలామంది పాలు తీసుకుంటుంటారు. ఇది చాలా మంచి పద్దతి. ఇందులో కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, విటమిన్ ఎ, విటమిన్ డి ఉండటం వల్ల బోన్ హెల్త్‌కు దోహదపడుతుంది. ఎముకలు పటిష్టంగా ఉంటాయి. పాలకూర సహా ఆకుకూరల్లో కూడా కాల్షియం, ఐరన్ చాలా ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల ఎముకలు బలంగా మారతాయి. ఆకుకూరలతో స్మూదీ చేసుకుని తీసుకోవాలి. 

ఇక ఎముకల్ని బలంగా మార్చేందుకు కావల్సిన మరో డ్రింక్ బాదం పాలు , ఖర్జూరం మిశ్రమం. ఈ డ్రింక్ రోజూ తాగడం వల్ల పొటాషియం, కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. ఎముకలు ఎప్పటికీ ధృఢంగా ఉంటాయి. అనారోగ్య సమస్యలు తలెత్తవు. 

Also read: AP Cabinet: ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు, 3 వేల వృద్ధాప్య పెన్షన్, విశాఖ మెట్రోకు గ్రీన్‌సిగ్నల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News