Flax seeds: మలబద్ఘకం సమస్యను నిర్లక్ష్యం వహిస్తే ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. అందుకే ఈ సమస్య ఎదురైనప్పుడు వెంటనే చికిత్స తీసుకోవాలి. జీవనశైలి, ఆహారపు అలవాట్లు సక్రమంగా ఉంటే ఈ సమస్య నుంచి బయటపడటం పెద్ద కష్టమేం కాదు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాస్తవానికి మలబద్ధకం అనేది జీర్ణక్రియ సంబంధిత సమస్య. వారంలో 3 లేదా అంతకంటే తక్కువసార్లు మల విసర్జన అవుతుంటే మీకు మలబద్ఘకం సమస్య ఉన్నట్టే. సక్రమంగా లేని జీవనశైలి వల్లనే ఈ సమస్య ఉత్పన్నమౌతుంది. జంక్ ఫుడ్స్, మసాలా ఫుడ్స్ తీసుకునే అలవాటుంటే, నీళ్లు తక్కువ తాగుతుంటే ఈ సమస్య ఎదురుకావచ్చు. శారీరక శ్రమ లేకపోయినా ఈ సమస్య ఎదురౌతుంది. జీవనశైలి, ఆహారపు అలవాట్లు సక్రమంగా ఉంటే మలబద్ధకం సమస్య త్వరగానే తొలగిపోతుంది. రాను రానూ ఈ సమస్య పెరుగుతుంటే వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి. దీర్ఘకాలం ఈ సమస్య ఉండటం మంచిది కాదు. మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు ఫ్లక్స్ సీడ్స్  అద్భుతంగా పనిచేస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. 


ఫ్లక్స్ సీడ్స్‌లో ప్రోటీన్లు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, డైటరీ ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు జీర్ణక్రియకు మెరుగుపరుస్తాయి. ఫ్లక్స్ సీడ్స్ తరచూ తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. కొన్ని అధ్యయనాల ప్రకారం ఫ్లక్స్ సీడ్స్ అద్భుతమైన ఔషధం. ఫ్లక్స్ సీడ్స్ తీసుకుంటే కేవలం 12-24 గంటల్లోపే శుభ్రమైపోతుంది. మలబద్ధకం సమస్య నుంచి బయటపడేందుకు రోజూ 1 స్పూన్ ఫ్లక్స్ సీడ్స్‌ను తీసుకోవల్సి ఉంటుంది. దీనివల్ల మనిషి శరీరానికి కావల్సిన ఫైబర్ లభిస్తుంది. 


Also read: JEE Main 2024 Results: జేఈఈ మెయిన్స్ సెషన్ 1 2024 ఫలితాల విడుదల , ఇలా చెక్ చేసుకోండి



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook