Ghee Benefits: అయితే స్వచ్ఛమైన నెయ్యితో  బరువు కూడా తగ్గించుకోవచ్చని చాలామందికి తెలియదు. జీర్ణక్రియ మెరుగుపర్చుకోవడం, కీళ్ల నొప్పులు, ఇమ్యూనిటీ పటిష్టం చేయడం అన్నీ నెయ్యితో చాలా సులభంగా పరిష్కరించవచ్చంటున్నారు. తరచూ సమస్యల బారిన పడుతుంటే నెయ్యి సరైన ప్రత్యామ్నాయం కాగలదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నెయ్యిని రోజూ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అస్తవ్యస్థమైన ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చు. అయితే నెయ్యి ఎప్పుడు సేవించాలనేది తెలుసుకోవడం చాలా అవసరం. నెయ్యితో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి. అందుకే చిన్న పిల్లలకు అన్నం తిన్పించేటప్పుడు తప్పకుండా నెయ్యి కలిపి తిన్పిస్తుంటారు. స్వచ్ఛమైన నెయ్యి అయితే అందులో విటమిన్ ఎ, విటమిన్ ఇ, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కాల్షియం పెద్దమొత్తంలో ఉంటాయి. భోజనంలో కలిపి నెయ్యి తినడం వల్ల ఆరోగ్యపరంగా ప్రయోజనాలు కలగడమే కాకుండా రుచి అమోఘంగా పెరుగుతుంది. ఇమ్యూనిటీ పెరగడం వల్ల తరచూ రోగాలు పడే 
అవస్థ తగ్గుతుంది.


ఆధునిక పోటీ ప్రపంచంలో ఆహారపు ఆలవాట్లు సరిగ్గా లేకపోవడంతో సీజన్ మారిన ప్రతిసారీ జబ్బు పడుతుంటారు. ఈ పరిస్థితుల్లో శరీరానికి పౌష్ఠికాహారం తప్పనిసరి అవుతుంది. నెయ్యి ఇందుకు అద్బుతంగా ఉపయోగపడుతుంది. ఉదయం పరగడుపున రోజూ నెయ్యి సేవిస్తే..చాలా ప్రయోజనాలున్నాయి. వివిధ రకాల అనారోగ్య సమస్యలు దూరమౌతాయి. రోజూ డైట్‌లో భాగం చేసుకోవాలి. 


రోజూ ఉదయం పరగడుపున నెయ్యి తీసుకుంటే ప్రయోజనాలు రెట్టింపవుతాయి. ముఖ్యంగా శరీరం ఇమ్యూనిటీ గణనీయంగా పెరుగుతుంది. రోజుకు ఒక స్పూన్ నెయ్యి చాలు..మిమ్మల్ని ఫిట్ అండ్ హెల్తీగా ఉంచడానికి. ఇందులో ఉండే హెల్తీ ఫ్యాట్స్ వల్ల ఫిట్‌గా ఉంటారు ఇమ్యూనిటీ పెరగడమే కాకుండా బరువు నియంత్రణలో ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాల వల్ల చర్మానికి నిగారింపు రావడమే కాకుండా ఏజీయింగ్ సమస్య పోతుంది. రోజూ గోరు వెచ్చని నీటిలో ఒక స్పూన్ నెయ్యి కలిపి తాగితే మంచి ఫలితాలు ఉంటాయి.


చాలామందికి మలబద్ధకం సమస్య ఉంటుంది. సీజన్ మారినప్పుడు నెయ్యిని భోజనంతో కలిపి తీసుకుంటే ఈ సమస్య నిర్మూలించవచ్చు. ఉదయం పరగడుపున నెయ్యి తినడం వల్ల మలబద్ధకం, స్వెల్లింగ్, కడుపు నొప్పి వంటి సమస్యలు కొన్నిరోజుల్లోనే తగ్గిపోతాయి. నెయ్యిలో ఉండే బ్యూటిరిక్ యాసిడ్ కారణంగా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఒక గ్లాసు గోరు వెచ్చని నీళ్లలో ఒక స్పూన్ నెయ్యి కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్యం ఫిట్‌గా ఉంటుంది.


నెయ్యిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే రోజూ ఉదయం పరగడుపున సేవించమనే సలహా ఇస్తుంటారు. రోజూ నెయ్యి తినడం వల్ల కీళ్ల నొప్పుల సమస్య తొలగిపోతుంది. శరీరంలో కాల్షియం లోపముంటే అది కూడా పోతుంది. ఎముకలకు పటిష్టమౌతాయి.


Also read: Weight Loss Tips: ఈ నీళ్లు నాలుగు వారాలు తాగితే చాలు, బరువు తగ్గడం ఖాయం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook