Milk-Dry grapes Benefits: ప్రకృతిలో మన చుట్టూ లభించే చాలా పదార్ధాలు మెరుగైన ఆరోగ్యాన్ని అందిస్తుంటాయి. ఏవి తింటే మంచిదనేది తెలుసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం ఉంటుంది. ప్రకృతిలో లభించే వివిధ పదార్ధాల పోషక విలువలు తెలుసుకుంటే చాలా ప్రయోజనాలుంటాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పాలను సూపర్ ఫుడ్‌గా పిలుస్తారు. ఇందులో ఎండు ద్రాక్ష కలిపితే మరిన్ని ప్రయోజనాలుంటాయి. ఎందుకంటే పాలు, ద్రాక్ష రెండింట్లోనూ పోషక పదార్ధాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మెరుగైన ఆరోగ్యం కోసం ఈ రెండూ అద్భుతంగా పనిచేస్తాయి.


రోజువారీ జీవితంలో మనం తీసుకునే ఆహారపు అలవాట్లే ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. ఆహారపు అలవాట్లు బాగుంటే ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. లేకుంటే అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. మెరుగైన ఆరోగ్యం కోసం డైట్‌లో పాలు, ఎండుద్రాక్ష చేర్చుకుంటే చాలని..అద్భుత ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు వైద్య నిపుణులు. పోషక పదార్ధాలు పుష్కలంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల అనారోగ్యం ఎప్పటికీ దరిచేరదు.


శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే వివిధ రకాల పదార్ధాల్లో ముఖ్యమైనవి పాలు, ఎండుద్రాక్ష..ఈ రెండింట్లోనూ పోషక పదార్ధాలు పుష్కలంగా లభిస్తాయి. ఎండుద్రాక్షలో హెల్తీ ఫ్యాట్స్, ఫైబర్, కాపర్, ఐరన్, కాల్షియం, పొటాషియం పుష్కలంగా ఉంటే..పాలలో కాల్షియం, ప్రోటీన్లు, విటమిన్ డి అత్యధికంగా ఉంటాయి. అందుకే ఈ రెండూ కలిపి ప్రతిరోజూ తాగితే శరీరంలో పోషక పదార్ధాల లేమి తలెత్తదు. ఫలితంగా గంభీరమైన రోగాలు దూరమౌతాయి. ఆరోగ్యం బాగుంటుంది. పాలు, ఎండుద్రాక్ష కలిపి తాగడం వల్ల ఏయే ప్రయోజనాలున్నాయో చూద్దాం..


జ్ఞాపక శక్తి


పాలలో ఎండు ద్రాక్ష కలిపి తీసుకోవడం వల్ల ఆందోళన, ఒత్తిడి వంటి సమస్యల్ని జయించవచ్చు. ముఖ్యంగా జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మెదడు పనితీరు అద్భుతంగా ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే బుద్ధి వికసితమౌతుంది. రాత్రి పడుకునేముందు పాలలో ఎండుద్రాక్ష కలిపి తాగడం వల్ల మంచి నిద్ర పడుతుంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి ఇదొక మంచి ఔషధం. రాత్రి పూట వివిధ కారణాలతో నిద్ర పట్టక సతమతమౌతుంటే ఇది మంచి ప్రత్యామ్నాయం.


ఎముకలకు బలం


పాలు, ఎండుద్రాక్ష రెండింట్లోనూ కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఈ రెండు కలిపి తీసుకోవడం ద్వారా ఎముకలు చాలా పటిష్టంగా మారతాయి. ఎండుద్రాక్షలో ఉండే బోరాన్ అనే కెమికల్ ఎముకలకు చాలా ఉపయోగకరం. దీనివల్ల కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి. ఫ్రాక్చర్ కారణంగా ఏర్పడే గాయాలు తగ్గుతాయి. ఇతర చాలా గంభీరమైన రోగాలకు పాలు-ఎండుద్రాక్ష మిశ్రమం అద్భుతంగా పనిచేస్తుంది. 


ఎండుద్రాక్షలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపర్చడమే కాకుండా మెటబోలిజంను వృద్ధి చేస్తుంది. శరీరంలో మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. కోలన్ పనితీరు మెరుగుపడుతుంది. శరీరాన్ని ఎప్పటికప్పుడు డీటాక్సిఫై చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటాము. శరీరం మెటబోలిజం వేగవంతమైతే..ఏ రకమైన అనారోగ్య సమస్య రాదు. ఎందుకంటే అన్నింటికీ మూలం జీవక్రియే.


Also read: Ammonia foods: లివర్, కిడ్నీలకు హాని కలిగేది ఈ పదార్ధాలతోనే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook