Neem Benefits: వేప చెట్టుకు ఆయుర్వేద శాస్త్రంలో విశేష ప్రాధాన్యత ఉంది. సనాతన భారతీయ వైద్య విధానంలో కూడా వేపకు సంబంధించి విస్తృతమైన సమాచారం ఉంది. అసలు వేపను ప్రపంచానికి పరిచయం చేసిందే ఇండియా. వేపతో అన్ని వ్యాధులకు పరిష్కారముంది. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వేప చెట్టు భారతీయులకు చాలా ప్రత్యేకమైంది. సహజసిద్ధమైన యాంటీ బయాటిక్‌గా..బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్‌గా ఇంకా ఇలా చాలా ప్రయోజనాలున్నాయి. రుచిలో చేదుగా ఉన్నా అద్భుతమైన ఔషధమిది. వేప గురించి భారతీయ సనాతన వైద్యంలో ఉన్నంత విస్తృతమైన సమాచారం మరెక్కడా లేదంటే అతిశయోక్తి కానేకాదు. వేపను ప్రపంచానికి పరిచయం చేసింది కూడా భారతదేశమే. భారతదేశంలోని సనాతన ఆయుర్వేద శాస్త్రంలో వివరించిన వేప లాభాలు, ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతాం. ప్రకృతిలో సహజసిద్దమైన బెస్ట్ యాంటీ బయోటిక్‌గా , అద్భుతమైన ఔషధ గుణాలున్న మొక్కగా వేపకు పేరుంది. 


వేపలో చాలా రకాల పోషక గుణాలున్నాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చాలా ఎక్కువ. అందుకే ఆరోగ్యపరంగా చాలా మంచిది. వేప ఆకులతో అల్సర్లు, జీర్ణకోశ వ్యాధులు, మెదడు సంబంధిత సమస్యలు, చర్మవ్యాధులు, జుట్టు సమస్య, కాలేయం, మూత్రపిండాల వ్యాధి ఇలా చాలా సమస్యలు నయం చేయవచ్చు. మలేరియా తీవ్రత పెరగకుండా చేయడంలో వేప అద్భుతంగా పనిచేస్తుంది. వేపలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మలేరియాను నియంత్రిస్తాయి.


ఇప్పటికీ అందర్నీ పీడిస్తున్న కామెర్లు వ్యాధికి వేపను మించిన ఔషధం లేదనే చెప్పాలి. దీనికోసం వేపరసంలో కొద్దిగా తేనె కలుపుకుని తాగితే..కామెర్ల నుంచి రక్షించుకోవచ్చు. వేపరసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మధుమేహం వ్యాధి కూడా అదుపులో ఉంటుంది. వేపకు ఉండే మరో గుణం యాంటీ వైరల్. వేపతో వైరల్ ఫీవర్లు తగ్గుతాయి. అందుకే ఇప్పటికే చాలా ప్రాంతాల్లో పొంగు, చికెన్ ఫాక్స్ వంటి వ్యాధులు వచ్చినప్పుడు వేపాకులతోనే వైద్యం చేస్తారు. రోగిని వేపాకులపై పడుకోబెడతారు. 


వేపాకులతో గుండె సంబంధిత సమస్యలు కూడా దూరమౌతాయి. అదే సమయంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. గర్భిణీలు వేపాకుల నీరు తాగడం వల్ల యోని సంబంధిత సమస్యలు దూరమౌతాయి. డెలివరీ అనంతరం కొన్ని రోజులు వేపాకుల నీరు తాగితే..చాలా రకాల ఇన్‌ఫెక్షన్లు దూరమౌతాయి. దంతాల సమస్య, చిగుళ్ల నుంచి రక్తం కారడం వంటి సమస్యలకు వేప అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈ సమస్యలకు వేప చెట్టు బెరడు లేదా ఆకుల్ని నీటిలో ఉడకబెట్టి ఆ నీళ్లతో నోరు శుభ్రం చేసుకోవాలి. 


బహుశా అందుకే ఇప్పటికీ చాలా పల్లెల్లో, పట్టణాల్లో కూడా పెద్దలు వేపు పుల్లలతోనే పళ్లు శుభ్రం చేసుకుంటుంటారు. ఇది ఇప్పటి తరానికి అర్ధం కాదు గానీ పంటి సమస్యలకు దరిచేరకుండా అద్భుతంగా ఉపయోగపడే బ్రషింగ్ విధానం. 


Also read: Eggs Side Effects: ఎండాకాలంలో గుడ్లు తినడం మంచిదేనా కాదా, తింటే ఏం జరుగుతుంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook