Eggs Side Effects: ఎండాకాలంలో గుడ్లు తినడం మంచిదేనా కాదా, తింటే ఏం జరుగుతుంది.

Eggs Side Effects: గుడ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. గుడ్లను అందుకే సూపర్ ఫుడ్‌గా పిలుస్తారు. ఇందులో దాదాపు అన్ని రకాల పోషకాలు నిండి ఉంటాయి. బహుశా అందుకే రోజుకో గుడ్డు తినమని వైద్యులు సూచిస్తుంటారు. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 21, 2023, 01:57 PM IST
Eggs Side Effects: ఎండాకాలంలో గుడ్లు తినడం మంచిదేనా కాదా, తింటే ఏం జరుగుతుంది.

Eggs Side Effects: గుడ్డు ఆరోగ్యానికి ఎంత మంచిదైనా సరే పరిమితి దాటకూడదు. అదే సమయంలో వేసవికాలంలో గుడ్డు తినడం ఆరోగ్యానికి హానికరమని వైద్యులు చెబుతున్నారు. వేసవిలో గుడ్లు ఎందుకు తినకూడదు, తింటే ఏం జరుగుతుందనే వివరాలు తెలుసుకుందాం..

గుడ్లలో మనిషి సంపూర్ణ ఆరోగ్యానికి కావల్సిన పోషకాలు సంపూర్ణంగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో ప్రోటీన్లు, కాల్షియం వంటి పోషకాలు అత్యధికంగా ఉంటాయి. ఫలితంగా శరీరానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి. గుడ్లు రోజూ తీసుకోవడం వల్ల ఎముకలు పటిష్టమవడం, కండరాల ఎదుగుదల ఉంటుంది. కానీ ఎండాకాలంలో గుడ్లు తినడం అనారోగ్య సమస్యలకు కారణమౌతుందట. ఆశ్చర్యంగా ఉందా..నిజమే. వేసవిలో గుడ్ల వల్ల కలిగే నష్టాలేంటో తెలుసుకుందాం..

ఎండాకాలంలో గుడ్లు తినడం వల్ల కడుపులో వేడి పెరుగుతుంది. గుడ్డు స్వభావం వేడి చేసేది కావడంతో ఈ పరిస్థితి ఉంటుంది. గుడ్డు వల్ల దాంతో బయటి వేడి, లోపలి వేడి రెండూ పెరిగిపోతాయి. ఫలితంగా కడుపుపై ప్రభావం పడి.. ఎసిడిటీ, మంట సమస్యలు తలెత్తుతాయి. అందుకే వేసవిలో సాధ్యమైనంతవరకూ గుడ్లకు దూరంగా ఉంటే మంచిది.

మరోవైపు వేసవిలో అదేపనిగా గుడ్లు తినడం వల్ల జీర్ణ సంబంధ సమస్యలు ఉత్పన్నమౌతాయి. కడుపు నొప్పి, అజీర్తి సమస్యలు తలెత్తుతాయి. ఒకవేళ ఎండాకాలంలో గుడ్లు తినాల్సి వస్తే నీళ్లు ఎక్కువగా తాగవలసి వస్తుంది. మరోవైపు వేసవిలో గుడ్లు తింటే కిడ్నీలపై కూడా ప్రభావం పడుతుంది. దీనికి కారణం గుడ్లలో ఎక్కువగా ఉండే ప్రోటీన్లు. గుడ్లు తినడం వల్ల కిడ్నీలపై ప్రోటీన్లను జీర్ణం చేసుకునేందుకు ఒత్తిడి పెరుగుతుంది. 

గుడ్లలో అత్యధికంగా ఉండే ప్రోటీన్లను జీర్ణం చేసేందుకు చాలా శక్తి కావల్సి వస్తుంది. అందుకే సాధ్యమైనంత ఎక్కువ నీళ్లను తాగాలి. వేసవిలో ఏం తిన్నా సరే నీళ్లు ఎక్కువగా తాగితే చాలావరకూ నష్టాన్ని నివారించవచ్చు.

Also read: Vitamin B12 Foods: విటమిన్ బి12 నాన్‌వెజ్‌లోనే కాదు..వెజ్‌లో కూడా లభిస్తుంది, ఆ పదార్ధాలివే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News