Papaya Benefits: పండ్లు ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు అందిస్తాయనడంలో ఏమాత్రం సందేహం లేదు అదే సమయంలో కొన్ని రకాల పండ్లను ఉదయం పరగడుపున తీసుకుంటే దుష్పరిణామాలు ఎదురౌతాయి. కానీ బొప్పాయి మాత్రం ఇందుకు పూర్తిగా మినహాయింపు. బొప్పాయితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో పరిశీలిద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సాధరణంగా శరీరాన్ని డీటాక్స్ చేసేందుకు అనువైన సమయం ఉదయం. బహుశా అందుకే చాలావరకూ ఆయుర్వేద చిట్కా వైద్య విధానాలను ఉదయం వేళ తీసుకోమంటారు ఆరోగ్య నిపుణులు. 
రోజూ ఉదయం లేవగానే 2-3 గ్లాసు నీళ్లు తాగమని సూచిస్తుంటారు. ఎందుకంటే ఈ అలవాటు వల్ల శరీరం పూర్తిగా డీటాక్స్ అవుతుంది. అదే విధంగా ఉదయం వేళ పండ్లు తినడం కూడా చాలా మంచి అలవాటు. ముఖ్యంగా ఉదయం పరగడుపున బొప్పాయి తింటే ఆరోగ్యం మెరుగుపడుతుంది. బొప్పాయి తింటే రోజంతా కావల్సిన శక్తి లభించడంతో ఫుల్ ఎనర్జిటిక్‌గా ఉంటారు. పండ్లు వంటి హెల్తీ ఫుడ్ ఉదయం తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. 


బొప్పాయి రుచిలో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక ఆరోగ్యపరంగా పరిశీలిస్తే ఇందులో ఫైబర్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. దాంతోపాటు విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి కూడా పెద్దమొత్తంలో లభిస్తాయి. అంతేకాకుండా బొప్పాయిలో ల్యూటిన్, జెక్సాంథిన్ కైరోటెనాయిడ్స్  ఉంటాయి. ఇవి మనిషి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. 


గుండె ఆరోగ్యం


కొలెస్ట్రాల్ సమస్య లేదా డయాబెటిస్ లేదా గుండె వ్యాధుల సమస్యలు, స్థూలకాయం కలిగినవాళ్లకు బొప్పాయి చాలా అద్భుతమైన ఫ్రూట్ అని చెప్పవచ్చు. రోజూ ఉదయం వేళ పరగడుపున బొప్పాయి తినడం అలవాటు చేసుకుంటే కొలెస్ట్రాల్, డయాబెటిస్ నియంత్రణలో ఉంటాయి. అటు అధిక రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. 


కడుపు సంబంధిత సమస్యలు


ప్రతిరోజూ ఉదయం వేళ బ్రేక్‌ఫాస్ట్ రూపంలో బొప్పాయి తింటే ఇక ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలు చేకురుతాయి. ముఖ్యంగా జీర్ణక్రియ వ్యవస్థను పటిష్టం చేస్తుంది. ఇందులో అధిక మోతాదులో ఉండే ఫైబర్ జీర్ణక్రియకు ఉపయోగపడుతుంది. మరోవైపు మలబద్ధకం సమస్య కూడా తొలగిపోతుంది. క్రమంగా మీ కడుపు క్లీన్ అవుతుంది. 


అధిక బరువుకు చెక్


బొప్పాయిని వెయిట్ లాస్ ప్రక్రియలో విరివిగా ఉపయోగిస్తారు. బరువు తగ్గించేందుకు బొప్పాయి అద్భుతంగా దోహదమౌతుంది. బరువు తగ్గించేందుకు దీర్ఘకాలంగా ప్రయత్నించి విఫలమౌతుంటే ఇక నుంచి రోజూ ఉదయం వేళ పరగడుపున బొప్పాయి తినడం అలవాటు చేసుకోండి. కేవలం వారాల వ్యవధిలోనే మెరుగైన ఫలితాలు కన్పిస్తాయి.


రోగ నిరోధక శక్తి 


బొప్పాయిలో విటమిన్ సి , యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉన్నందున రోగ నిరోధక శక్తి పెరిగేందుకు అద్భుతంగా దోహదపడుతుంది. రోజూ తింటే ఇమ్యూనిటీ పటిష్టమౌతుంది. అటు చర్మ సంరక్షణకు కూడా బొప్పాయి చాలా బాగా పనిచేస్తుంది. శరీరాన్ని ఎప్పటికప్పుడు డీటాక్స్ చేస్తుంది.


Also read: Insomnia: రోజూ 5 గంటలు కూడా నిద్రపోవడం లేదా, అయితే ఈ ప్రమాదకర సమస్యలు వెంటాడవచ్చు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook