Health Benefits Pomegranate Juice in Summer: దానిమ్మలో పోషక పదార్ధాలు మినరల్స్, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే దానిమ్మ క్రమం తప్పకుండా తీసుకుంటే చాలా రకాల అనారోగ్య సమస్యలు దూరం చేయవచ్చు. దానిమ్మ ఆరోగ్యపరంగానే కాకుండా..రుచిలో కూడా అద్భుతమే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దానిమ్మను చాలా మంది ఆరోగ్యం దృష్టితోనే చూస్తుంటారు. కానీ దానిమ్మతో బరువు అద్భుతంగా తగ్గించుకోవచ్చని అందరికీ తెలియదు. ఎందుకంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువగా ఉండి కేలరీలు తక్కువగా ఉంటాయి. మరోవైపు దానిమ్మలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉన్నందున కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. దానిమ్మ జ్యూస్ తాగితే కడుపు నిండుగా ఉండి ఎక్కువసేపు ఆకలేయదు. దాంతో అనారోగ్యకరమైన స్నాక్స్‌కు దూరంగా ఉంటారు. దానిమ్మ రసంలో పంచదార, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఉండే పంచదార, విటమిన్లు, మినరల్స్‌తో కలిసి సులభంగా జీర్ణమౌతుంది. అందుకే దానిమ్మ జ్యూస్ తాగడం వల్ల ఇన్‌స్టంట్ ఎనర్జీ లభిస్తుంది. ఆరోగ్యంగా ఉంచుతుంది. అందుకే వేసవిలో దానిమ్మ జ్యూస్ మంచి ప్రత్యామ్నాయం. దానిమ్మ జ్యూస్ తాగిన తరువాత అకారణంగా ఏదీ తినాలన్పించదు. దాంతో బరువు తగ్గేందుకు వీలవుతుంది.


దానిమ్మ జ్యూస్ ప్రయోజనాలు..


దానిమ్మ జ్యూస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. మెటబోలిజంను వేగవంతం చేస్తాయి. శరీరం బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది.


బరువు తగ్గించేందుకు ప్రయత్నిస్తుంటే..దానిమ్మ జ్యూస్ మంచి ప్రత్యామ్నాయం. బరువు తగ్గించేందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇందులో తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్, పోలీఫెనోల్స్ ఉంటాయి.


దానిమ్మ జ్యూస్‌లో ఫైబర్ చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఫైబర్ కారణంగా జీర్ణక్రియకు కేలరీలు బర్న్ అయ్యేందుకు ఉపయోగపడుతుంది. మీ ప్రేవుల్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది.


Also Read: Cholesterol signs: మీ ముఖంపై ఈ లక్షణాలు కన్పిస్తుంటే..కొలెస్ట్రాల్ సమస్య అధికంగా ఉన్నట్టే


Also Read: Oil For Beard Growth: గడ్డం పొడవుగా పెంచుకోవాలనుకుంటున్నారా? ఈ నూనె 10 రోజుల్లో గ్రోత్‌ రావడం ఖాయం!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook