శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు విటమిన్లు అవసరం చాలా కీలకం. ఇందులో విటమిన్ ఎ చాలా రకాల అనారోగ్య సమస్యలకు పరిష్కారంగా నిలుస్తుంటుంది. కళ్లు, గుండె, ఊపిరితిత్తులకు ఆరోగ్యాన్ని కల్పిస్తుంది. ఇమ్యూనిటీని పటిష్టం చేయడంలో విటమిన్ ఎ అద్భుతంగా ఉపయోగపడుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శరీరం ఆరోగ్యం కోసం విటమిన్లు, మినరల్స్ వంటి పోషక పదార్ధాలు చాలా అవసరం. అన్నింటికంటే కీలకమైంది విటమిన్ ఎ. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మ కణాల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. శరీరంలో విటమిన్ ఎ లోపముంటే వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతుంటాయి. హెల్తీ ఫుడ్స్ తీసుకోవడం ద్వారా ఈ వ్యాధుల్ని దూరం చేయవచ్చు. విటమిన్ ఎ లోపముంటే ఎలాంటి ఆహార పదార్ధాలు తీసుకోవాలి, లేకపోతే ఏ సమస్యలు తలెత్తుతాయనేది పరిశీలిద్దాం.


విటమిన్ ఎ లోపముంటే తీసుకోవల్సిన ఆహార పదార్ధాలు


స్వీట్ పొటాటో


స్వీట్ పొటాటోలో విటమిన్ ఎ పుష్కలంగా లభిస్తుంది. ఇందులో బీటా కెరోటిన్ అధిక మోతాదులో ఉంటుంది. ఇందులో విటమిన్ సి, పొటాషియం, ఐరన్ కూడా ఉంటుంది. విటమిన్ ఎ లోపాన్ని సరిజేసేందుకు స్వీట్ పొటాటో అద్బుతంగా పనిచేస్తుంది. మీక్కూడా శరీరంలో విటమిన్ ఎ లోపముంటే..రోజూ తప్పనిసరిగా స్వీట్ పొటాటో తీసుకోవల్సి ఉంటుంది. 


క్యారట్


విటమిన్ ఎ పుష్కలంగా లభించే కూరగాయల్లో ముఖ్యమైంది క్యారట్. మీ శరీరంలో విటమిన్ ఎ లోపముంటే..డైట్‌లో క్యారట్ తప్పనిసరిగా చేర్చాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మీ చర్మాన్ని పరిరక్షిస్తాయి. కంటి ఆరోగ్యానికి, చూపుకు విటమిన్ ఎ చాలా మంచిది.


బొప్పాయి


బొప్పాయి కడుపుకు చాలా ప్రయోజనకరం. బొప్పాయిలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. శరీరంలో విటమిన్ ఎ లోపాన్నిదూరం చేసేందుకు ఉపయోగపడుతుంది. 


Also read: Pista Health Benefits: మదుమేహంతో పాటు ఆ 5 సమస్యలు దూరం కావాలంటే ఈ డ్రై ఫ్రూట్ తినాల్సిందే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook