Ajwain Benefits: ప్రతి కిచెన్‌లో సర్వ సాధారణంగా కన్పించే వాముతో కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. వాముతో బరువు ఒక్కటే కాదు..మధుమేహాన్ని కూడా తగ్గించవచ్చు. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాము అనేది ప్రతి భారతీయుడి ఇంట్లో తప్పకుండా ఉంటుంది. సాధారణంగా జీర్ణక్రియను మెరుగుపర్చేందుకు వామును వినియోగిస్తుంటారు. అయితే వాముతో ప్రయోజనాలు చాలా ఉన్నాయి. వాములో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలున్నాయి. వామును అధిక బరువుకు చెక్ పెట్టేందుకు ఉపయోగిస్తుంటారు. అయితే వాముతో మధుమేహం కూడా తగ్గించవచ్చు. మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రించేందుకు వాము అద్భుతంగా ఉపయోగపడుతుంది. 


డయాబెటిస్ రోగులు వాము తీసుకోవడం వల్ల మంచి ఫలితాలుంటాయి. ఎందుకంటే వాములో పైబర్ పుష్కలంగా ఉంటుంది. ఫైబర్ అనేది రక్తంలో షుగర్ స్థాయిని తగ్గించడంలో దోహదపడుతుంది. మీ డైట్‌లో వాము చేర్చడం ద్వారా మధుమేహాన్ని నియంత్రణలో ఉంచవచ్చు.


వాములో ఫైబర్ పుష్కలంగా ఉన్నందున..బరువు సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ఒకవేళ మీరు డయాబెటిక్ రోగి అయితే..వాము లేదా అజ్వైన్ తప్పకుండా తీసుకోవాలి. దీనివల్ల బరువు కూడా తగ్గుతారు. డయాబటిస్ ఉన్నప్పుడు బాడీ మెటబోలిజం సరిగ్గా ఉండదు. మెటబోలిజం వేగం తగ్గితే..బరువు పెరుగుతారు. వాము సహాయంతో మెటబోలిజం వృద్ధి చెందుతుంది. 


వాము ఎలా తీసుకోవాలి


వామును ప్రతిరోజూ డైట్‌లో భాగంగా చేసుకోవాలి. ఒక కప్పు నీళ్లలో ఒక స్పూన్ వాము వేసి ఉడికించాలి. ఆ తరువాత వడపోసి..భోజనం చేసిన 40 నిమిషాల తరువాత తీసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేయాలి.


Also read: Bone Health Diet: మీ డైట్‌లో ఆ పదార్ధాలుంటే..60 వయస్సులో కూడా ఎముకలకు పటుత్వం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook