చలికాలంలో శరీరం పట్టేసినట్టుంటుంది. అదే సమయంలో రక్తం చిక్కగా మారుతుంటుంది. ఫలితంగా హార్ట్ ఎటాక్ ముప్పు పెరుగుతుంది. రక్తం చిక్కగా మారితే స్ట్రోక్ సమస్య వెంటాడుతుంది. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు ఏం చేయాలి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మీ రక్తవాహికలు ఆరోగ్యంగా ఉండాలనుకుంటే..రక్తం పలుచగా ఉండాలనుకుంటే ఆహారపు అలవాట్లు మార్చుకోవల్సి ఉంటుంది. కొన్ని రకాల ఆహార పదార్ధాల్ని డైట్‌లో చేర్చుకోవడం ద్వారా రక్త వాహికల్లో రక్తం గడ్డకట్టకుండా నియంత్రించవచ్చు. సీరియస్ వ్యాధుల్నించి రక్షించుకోవచ్చు.


సిట్రస్ ఫ్రూట్స్


విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉన్న సిట్రస్ ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ ఫ్రూట్స్ తినడం వల్ల కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. నిమ్మ, ఆరెంజ్ వంటి ఫ్రూట్స్ ఇందుకు దోహదపడతాయి. ఇందులోని ఔషధ గుణాలు రక్త వాహికల్ని ఆరోగ్యంగా తీర్చిదిద్దుతాయి. సిట్రస్ ఫ్రూట్స్ తినడం వల్ల రక్త సరఫరా కూడా మెరుగవుతుంది. గుండె సంబంధిత వ్యాధుల ముప్పు దూరమౌతుంది. 


ఫ్లెక్స్ సీడ్స్


ఫ్లెక్స్ సీడ్స్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తం చిక్కగా మారకుండా నియంత్రిస్తాయి. ఫ్లెక్స్ సీడ్స్ తినడం వల్ల రక్తం గడ్డకట్టదు. గుండెకు చాలా మంచివి. 


బెర్రీస్


బ్లాక్ బెర్రీస్, స్ట్రాబెర్రీస్, బ్లూ బెర్రీస్ వంటి పండ్లను రక్త వాహికలకు చాలా ప్రయోజనకరం. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. రక్త వాహికల్ని ఆరోగ్యంగా మారుస్తాయి. బెర్రీస్ తినడం వల్ల కొలెస్ట్రాల్ సమస్య తగ్గుతుంది. బ్లెడ్ ప్రెషర్ నియంత్రణలో ఉంటుంది. 


జైతూన్ ఆయిల్


జైతూన్ ఆయిల్ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. ఇందులో అన్‌శాచ్యురేటెడ్ ఫ్యాట్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ తగ్గించేందుకు దోహదపడతాయి. రక్త వాహికల్ని ఆరోగ్యంగా మారుస్తాయి. ఇతర ఆయిల్స్‌తో పోలిస్తే ఆలివ్ ఆయిల్ రక్త సరఫరాను మెరుగ్గా చేస్తుంది. ఫలితంగా హార్ట్ ఎటాక్, స్ట్రోక్ సమస్య తగ్గుతుంది. 


Also read: Lung Cancer Symptoms: దగ్గు దీర్ఘకాలం వెంటాడితే తేలిగ్గా తీసుకోవద్దు, లంగ్ కేన్సర్ కావచ్చు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook