Fatty Acids importance: మనిషి మానసిక ఆరోగ్యంలో మార్పు కన్పిస్తే ఏదైనా విటమిన్ లోపం ఉండవచ్చని అనుకోవచ్చు. ముఖ్యంగా ఏదైనా అంశంపై ఏకాగ్రత పెట్టలేకుంటే కచ్చితంగా అది విటమిన్ లేదా మినరల్ లేదా ఫ్యాటీ యాసిడ్ లోపంతో కావచ్చు. ఏ విటమిన్ లోపిస్తే మనిషిలో ఏకాగ్రత సడలుతుందో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆరోగ్యంగా, ఫిట్ అండ్ స్లిమ్‌గా ఉండేందుకు దాదాపు అన్ని రకాల పోషకాలు అవసరమౌతాయి. అదే సమయంలో కొన్ని ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉండాలి. ఎందుకంటే మనం తీసుకునే ఆహారంలో విటమిన్లు, మినరల్స్ సంగ్రహణకు ఫ్యాటీ యాసిడ్స్ దోహదపడతాయి. విటమిన్లు ఫ్యాట్‌లో కరుగుతాయి. మనిషి శరీరంలో కణజాలం నిర్మాణంలో లేదా ఎనర్జీ కోసం ఉపయోగపడని ఫ్యాట్ శరీరంలో పేరుకుపోతుంటుంది. మనిషికి అవసరమైన ఫ్యాటీ యాసిడ్స్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ముఖ్యమైంది. ఇది శరీరాన్ని ఫిట్‌గా ఉంచేందుకు ఉపయోగపడుతుంది. శరీరంలో ఒమేగా ఫ్యాటీ యాసిడ్ లోపిస్తే ఆరోగ్యపరంగానే కాకుండా మానసికంగా కూడా ప్రభావం చూపిస్తుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో పాటు ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ కూడా అవసరం. ఈ ఫ్యాటీ యాసిడ్స్ ప్రభావం నేరుగా మెదడు, గుండె ఆరోగ్యంపై ఉంటుంది. ఇవి ఎక్కువగా సాల్మన్, ట్యూనా, సారిడన్ చేపల్లో ఉంటాయి. శాకాహారులకైతే ఇవి ఎక్కువగా చియా సీడ్స్‌లో లభిస్తాయి. 


ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లోపముంటే ముందుగా ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. చాలా త్వరగా ఇన్‌ఫెక్షన్లు సోకుతాయి. వివిధ రకాల వ్యాధుల్నించి పోరాడే శక్తి తగ్గిపోతుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లోపముంటే మహిళలకు పీరియడ్స్, ప్రెగ్నెన్సీ సమయంలో సమస్యలు ఉత్పన్నం కావచ్చు. బ్లీడింగ్ అధికంగా ఉంటుంది. 


ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లోపిస్తే ప్రధానంగా కన్పించే సమస్య ఏకాగ్రత లోపించడం. అంటే ఏ విషయంపై కూడా దృష్టి సారించలేకపోతారు. శ్రద్ధ ఉండదు. డైవర్ట్ అవుతుంటారు. కొన్ని సందర్భాల్లో విసుగు, అశాంతి ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లోపముంటే చాలా త్వరగా కోపమొస్తుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లోపముంటే ఆ ప్రభావం కిడ్నీలపై పడుతుంది. విష పదార్ధాలు పెరిగిపోతాయి. కంటి ఆరోగ్యానికి కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా అవసరం. ఇవి తగ్గితే కళ్లు డ్రై అవుతాయి. మొత్తానికి తినే ఆహారంలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లోపిస్తే ఏకాగ్రత లోపిస్తుంది. అందుకే తీసుకునే ఆహారం సరిగ్గా ఉండాలి. 


Also read: Drinking Water Precautions: భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగితే ఈ 7 సమస్యలు తప్పవా, ఎప్పుడు తాగాలి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook