Home Remedies: కొంతమంది ఉదయం లేవగానే కడుపు శుభ్రం కాదు. రోజంతా కడుపు నొప్పి, గ్యాస్ వంటి సమస్యలు కన్పించవచ్చు. లేదా కొంతమందిలో అవి కూడా కన్పించవు. చాలామంది ఈ మలబద్ధకం సమస్యను తేలిగ్గా తీసుకుంటారు. కానీ ఇది చాలా ప్రమాదకరం. కొన్ని హోమ్ రెమిడీస్ ఆధారంగా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపిస్తుంటాయి. ముఖ్యంగా జీర్ణక్రియపై ప్రభావం కన్పిస్తుంది. ఉదయం లేవగానే కడుపు శుభ్రం కాకపోతే కడుపు నొప్పి, గ్యాస్ వంటి సమస్యలు తలెత్తవచ్చు. రోజూ డైట్‌లో  ఫైబర్ పదార్ధాలు తగిన మోతాదులో లేకుంటే పాల ఉత్పత్తులు, మాంసం ఎక్కువగా తీసుకున్నా మల బద్ధకం సమస్య ఏర్పడుతుంది. డీహైడ్రేషన్ అంటే శరీరంలో తగిన మోతాదులో నీళ్లు లేకపోవడం వల్ల ఏర్పడుతుంది. వ్యాయామం చేయకపోవడం, రోజంతా ఒకేచోట కూర్చుండిపోవడం వల్ల ఇలాంటి సమస్య తలెత్తుతుంది.


మల బద్ధకం సమస్య నుంచి గట్టెక్కాలంటే ఫైబర్ ఎక్కువగా ఉండే పదార్ధాలు తీసుకోవాలి. జీర్ణక్రియను వేగవంతమై మల విసర్జన సులభమౌతుంది. అందుకే డైట్‌లో ధాన్యం, పండ్లు, కూరగాయలు, ఓట్స్, బార్లీ, నట్స్, పప్పులు ఎక్కువగా ఉపయోగించాలి.


మల బద్ధకం సమస్యను దూరం చేసేందుకు వాము అద్భుతంగా ఉపయోగపడుతుంది. వాముని స్లో ఫ్లేమ్‌‌పై వేడి చేసి పిండిగా చేసుకోవాలి. ఇందులో కొద్దిగా పింక్ సాల్ట్ కలపాలి. రోజూ అర చెంచా గోరువెచ్చని నీళ్లతో పాటు సేవించాలి. ఇలా చేయడం వల్ల మలబద్ధకం సమస్య పోతుంది. 


డీ హైడ్రేషన్ సమస్య కారణంగా కూడా మలబద్ధకం సమస్య ఏర్పడుతుంది. అయితే తగిన మోతాదులో నీళ్లు తాగితే ఏ సమస్యా ఉండదు. అవసరమైతే నిమ్మరసం తాగితే ఇంకా మంచిది. బాడీ డీటాక్స్ కూడా అవుతుంది. రోజుకు 2-3 లీటర్ల నీళ్లు తప్పనిసరి.


Also read: Summer Health Tips: వేవవికాలంలో తప్పకుండా తీసుకోవల్సిన ఫ్రూట్ సలాడ్ ఇదే, అన్ని సమస్యలు దూరం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook