Cracked Heels: పాదాల్లో పగుళ్లు బాదిస్తున్నాయా, ఈ విటమిన్ల లోపం కావచ్చు
Cracked Heels: శరీరానికి విటమిన్లు, మినరల్స్ చాలా అవసరం. శరీరానికి అవసరమైన పోషకాల్లో విటమిన్లు అత్యంత ముఖ్యమైనవి. విటమిన్ల లోపముంటే..చర్మంపై కచ్చితంగా ప్రతికూల ప్రభావం పడుతుంది. చాలామందిలో ఎక్కువగా కన్పించే ఈ సమస్యకు కారణం కూడా అదేనా...
Cracked Heels: చాలామందిలో ముఖ్యంగా మహిళలకు మడమ పగుళ్లతో ఉంటుంది. అంటే క్రాక్డ్ హీల్స్. పాదం అడుగున పగుళ్లు ఏర్పడి తీవ్రమైన నొప్పి కూడా ఉంటుంది. ఇది సాధారణంగా కన్పించే సమస్యే అయినా ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది.
మడమలు పగుళ్లతో ఉంటే ఇబ్బంది కలగడమే కాకుండా అంద వికారంగా కూడా ఉంటుంది. హీల్ క్రాక్‌కు చాలా కారణాలున్నాయి. చెడు చర్మం, వ్యర్ధాలు, మట్టి, ధూళి, డ్రైనెస్ వంటివి ప్రధాన కారణాలు. బయట మట్టిలో తిరిగేవారికి లేదా ఇంట్లో మహిళలు నీళ్లకు ఎక్స్‌పోజ్ అవుతున్నా ఈ సమస్య ఏర్పడుతుంది. దీంతోపాటు విటమిన్ల లోపం కూడా ఓ కారణం. హార్మోన్ అసమతుల్యత వల్ల ఈ సమస్య రావచ్చు. ఏయే విటమిన్ల లోపంతో క్రాక్ హీల్స్ సమస్య ఏర్పడనుంది..
కాలి చర్మం డ్రై అవుతున్నప్పుడు తేమ లేకపోవడంతో చర్మం రఫ్ అండ్ టఫ్‌గా మారుతుంది. పై పొరలు ఊడిపోయి..పగుళ్లు ఏర్పడతాయి. చాలా సందర్భాల్లో ఈ పగుళ్లు చాలా లోతుగా ఉండి నొప్పిగా కూడా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో చెప్పులు లేదా షూస్ వేసుకోవడం కూడా సమస్య కావచ్చు. ముఖ్యంగా విటమిన్ బి3, విటమిన్ సి, విటమిన్ ఇ ఈ సమస్యకు కారణంగా తెలుస్తోంది.
హార్మోన్ అసమతుల్యత కారణంగా కూడా క్రాక్ హీల్స్ సమస్య ఉత్పన్నం కావచ్చు. థైరాయిడ్, ఈస్ట్రోజన్ వంటి హార్మోన్స్ కీలక పాత్ర పోషిస్తాయి. ఈ సమస్య తీవ్రమైతే పగుళ్లు మరింత లోతుగా మారిపోతాయి. దాంతో నొప్పి ఎక్కువై ఒక్కోసారి రక్తం కూడా కారుతుంటుంది.
ఈ విటమిన్లు కేవలం క్రాక్ హీల్స్ సమస్యకే కాకుండా మొత్తం చర్మానికి ప్రయోజనకరం. ఈ న్యూట్రియంట్లు సహాయంతో కొలాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. దాంతో చర్మం రక్షింపబడుతుంది. మడమలు పగలకుండా ఉండాలంటే ఈ విటమిన్ల ట్యాబ్లెట్స్ నేరుగా తీసుకోవడం లేదా ఈ విటమిన్లు లభించే ఆహారం తీసుకోవడం చేయాలి.
Also read: Diabetes Tips: బ్లడ్ షుగర్ లెవెల్ నియంత్రణలో ఉండాలంటే డిన్నర్ తరువాత ఇలా చేయాల్సిందే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook