Fatty Liver: ఫ్యాటీ లివర్ సమస్యను డైట్ కంట్రోల్‌తో ఎంత సులభంగా తగ్గించుకోవచ్చో నిర్లక్ష్యం వహిస్తే అంతే ప్రాణాంతకమౌతుంది. వివిధ రకాల సమస్యలకు దారితీస్తుంది. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ సమస్య నుంచి ఎలా గట్టెక్కాలో, ఎలాంటి డైట్ పాటించాలో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆధునిక బిజీ లైఫ్, వివిధ రకాల ఆహారపు అలవాట్ల కారణంగా ఫ్యాటీ లివర్ సమస్య అధికమౌతోంది. చెడు ఆహారపు అలవాట్లే దీనికి కారణం. ఫ్యాటీ లివర్ ప్రాణాంతకం కాగలదు. కొన్ని పద్ధతులు పాటిస్తే ఈ సమస్య నుంచి గట్టెక్కవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ సమస్య నుంచి గట్టెక్కాలంటే ముందుగా చేయాల్సింది క్రమం తప్పకుండా వ్యాయామం. లేదా వాకింగ్. ఉదయం లేదా సాయంత్రం ఎప్పుడైనా ఓ పూట కనీసం అరగంట కేటాయించాలి.


ఫ్యాటీ లివర్ సమస్య తగ్గించేందుకు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవలి. దీనికోసం రోజుకు 500 కంటే ఎక్కువ కేలరీలు తగ్గించుకోవాలి. అటు డైట్ కూడా ఆరోగ్యంగా ఉండేట్టు చూసుకోవాలి. తగినంతగా నిద్ర లేకపోయినా ఈ సమస్య తలెత్తుతుంది. అందుకే నిద్ర సరిగ్గా ఉండేట్టు చూసుకోవాలి. రోజుకు కనీసం 7-8 గంటలు నిద్ర తప్పకుండా ఉండాలి. అది కూడా రాత్రి నిద్ర మాత్రమే. నిద్ర సరిగ్గా ఉంటే లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. రోజూ తగిన మోతాదులో నిద్ర లేకపోతే ఫ్యాటీ లివర్ సమస్య వెంటాడుతుంది.


ఫ్యాటీ లివర్ సమస్యకు ప్రధాన కారణం మద్యం సేవించడం. ఇటీవలికాలంలో చాలామంది మద్యంకు బానిసలౌతున్నారు. మద్యం కారణంగా ఫ్యాటీ లివర్ సమస్య వేధిస్తుంటుంది. ఫ్యాటీ లివర్ సమస్య నుంచి విముక్తి పొందాలంటే..తక్షణం మద్యం మానేయాలి. నాన్ వెజ్ ముఖ్యంగా మటన్, బీఫ్ ఎక్కువగా తినేవారికి ఈ సమస్య కన్పిస్తుంది. అందుకే ఫ్యాటీ లివర్ సమస్య నుంచి గట్టెక్కాలంటే ముందు మటన్, బీఫ్‌కు దూరంగా ఉండాలి.


ప్రోసెస్డ్ ఫుడ్స్‌కు పూర్తిగా దూరంగా ఉండాలి. షుగర్ డ్రింక్స్ కూడా మానేయాల్సి ఉంటుంది. ఈ రెండూ మీ లివర్‌ను ఫ్యాటీగా మార్చేస్తాయి. అందుకే ప్రోసెస్డ్ ఫుడ్, షుగర్ డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి. 


Also read: Belly Fat Loss Diet: బెల్లీ ఫ్యాట్, బరువు తగ్గడానికి సింపుల్‌ చిట్కాలు, కేవలం 12 రోజుల్లో మాయం!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook