These Habits helps your Kindey Healthy: శరీరంలో గుండెతో పాటు కిడ్నీలు అతి ముఖ్యమైనవి. కిడ్నీలు బాగున్నంతవరకే శరీరంలో అన్ని ప్రక్రియలు సజావుగా సాగుతాయి. ఆహారపు అలవాట్లే కిడ్నీల ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. కొన్ని రకాల పదార్ధాలు తినడం వల్ల కిడ్నీలు త్వరగా వయస్సు మళ్లిపోతుంటాయి. అంటే సామర్ధ్యం తగ్గిపోతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కిడ్నీల అనారోగ్యం అనేది పూర్తిగా ఆహారపు అలవాట్లు, జీవనశైలిని బట్టే ఉంటుంది. కిడ్నీలు బలహీనపడితే వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతాయి. అందుకే ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించాలి. కొన్ని పదార్ధాలు మీ కిడ్నీలను త్వరగా వృద్ధాప్యంలోకి నెట్టేస్తాయి. అంటే కిడ్నీల సామర్ధ్యం తగ్గిపోతుంది. అటువంటి పదార్ధాలకు దూరంగా ఉంటే కిడ్నీల్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.


కిడ్నీలపై దుష్ప్రభావం చూపించే అలవాట్లు


సోడా


సోడాలో ఫాస్పరస్ ఎక్కువగా ఉంటుంది. ఇది మీ కిడ్నీలకు హాని కలిగించడమే కాకుండా బలహీనపరుస్తుంది. సోడా తరచూ తాగేవారు ఆ అలవాటు మానుకోవాలి. కొంతమంది రోజూ అదే పనిగా సోడా తాగడం అలవాటుగా చేసుకుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. దీనివల్ల కిడ్నీలు త్వరగా పాడవుతాయి. 


అవకాడో


అవకాడో సైతం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఇందులో కూడా పొటాషియం పరిమాణం ఎక్కువగా ఉంటుంది. కిడ్నీలకు హాని కల్గిస్తుంది. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలనుకుంటే అవకాడో వంటి పదార్దాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా సోడియం ఎక్కువగా ఉండే పదార్ధాలకు దూరంగా ఉంటే మంచిది.


Also Read: Anemia Hypertension Symptoms: వీటి తొక్కల పొడితో రక్తహీనత, రక్తపోటు సమస్యలు 6 రోజుల్లో చెక్‌! నమ్మట్లేదా?


ఆయిలీ ఫుడ్స్


ఆయిలీ ఫుడ్స్ వల్ల కేవలం కిడ్నీలకే కాదు ఆరోగ్యానికి కూడా హానికరం. ఇటీవలి కాలంలో చాలామంది ఆయిలీ ఫుడ్స్ అంటేనే ఇష్టపడుతున్నారు. ఇది ఆరోగ్యపరంగా మంచి అలవాటు కాదు. ఆయిలీ ఫుడ్స్ వల్ల కిడ్నీలు త్వరగా పాడవుతాయి. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలనుకుంటే..ఆయిలీ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇవి మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. మీక్కూడా రోజూ ఆయిలీ ఫుడ్స్ తీసుకునే అలవాటుంటే..ఇవాళే మానేయండి


పిజ్జా


ఇటీవలి కాలంలో పిజ్జా వినియోగం అధికమైంది. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ పిజ్జా క్రేజ్ పెరిగిపోతోంది. పిజ్జా ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. పిజ్జా తినడం వల్ల ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుంది. పిజ్జా తినడం వల్ల కిడ్నీలు త్వరగా పాడవుతాయి. కిడ్నీల లైఫ్ తగ్గిపోతుంది.


మద్యం


మద్యం ఆరోగ్యానికి హానికరం. ఇది అందరికీ తెలిసిందే. అయినా ఈ అలవాటు మానుకోలేరు. మద్యం వల్ల శరీరంలోని అన్ని అంగాలపై దుష్ర్పభావం పడుతుంది. మరీ ముఖ్యంగా కిడ్నీలపై పెను ప్రభావం చూపిస్తుంది. 


Also Read: Constipation: అజీర్ణం, మలబద్ధకం సమస్యలకు శాశ్వత పరిష్కారం, ఈ కాషాయంతో 3 నిమిషయాల్లో చెక్‌!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook