Jamun for Health: గర్భిణీ మహిళలు నేరేడు పండ్లు తినవచ్చా లేదా, తింటే ఏమౌతుంది
Jamun for Health: ప్రతి మహిళ జీవితంలో గర్భ ధారణ ఓ అందమైన ఆస్వాదన. అనుభూతి. తల్లి అయ్యే మధుర ఘట్టం. అదే సమయంలో ఆరోగ్యంపై కూడా చాలా చాలా శ్రద్ధ అవసరమౌతుంది. అందుకే గర్భధారణ సమయంలో ప్రతి మహిళ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు.
Jamun for Health: సాధారణంగా మెరుగైన ఆరోగ్యం కోసం పండ్లు తినమని ప్రతి ఒక్కరూ చెబుతుంటారు. ముఖ్యంగా గర్భ ధారణ సమయంలో కొన్ని రకాల పండ్లు తప్పకుండా తినాలని వైద్యులు సూచిస్తుంటారు. కొన్ని పండ్లను మాత్రం తినవద్దని చెబుతుంటారు. గర్భిణీ మహిళలు నేరేడు పండ్లు తింటే ఆ ప్రభావం తల్లిపై బిడ్డపై ఎలా ఉంటుందో తెలుసుకుందాం..ఎందుకంటే గర్భం దాల్చడమనేది ప్రతి మహిళకు ఓ అందమైన అనుభవం. మహిళ జీవితంలో చాలా ఆనందముంటుంది. గర్భం సమయంలో ప్రతి మహిళ తన ఆరోగ్యంతో పాటు కడుపులో బిడ్డ ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టాలి. అందుకే తినే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం.
ప్రెగ్నెన్సీ డైట్ అనేది చాలా వేరుగా ఉంటుందంటున్నారు వైద్యులు. ఇలాంటి సమయంలో తల్లికి పూర్తి పోషకాలు అవసరమౌతాయి. ఆకు కూరలు, కూరగాయలు, పండ్లు, నట్స్ వంటివి తప్పకుండా తినాల్సి ఉంటుంది. ప్రెగ్నెన్సీ సమయంలో నేరేడు పండ్లు తినడం వల్ల తల్లీ, బిడ్డ ఆరోగ్యంపై మంచి ప్రభావం పడుతుంది. నేరేడుపండునిు అద్భుతమైన ప్రెగ్నెన్సీ డైట్‌గా పరిగణిస్తారు. నేరేడు ఆరోగ్యానికి చాలా మంచిది. గర్భిణీ మహిళలు నేరేడు పండ్లు తింటే..గర్భంలో ఉండే బిడ్డ ఎదుగుదలకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే నేరేడులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
నేరేడు పండు జ్యూసీగా ఉంటుంది. ఇందులో న్యూట్రిషన్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికం. ఇవి ఎముకల్ని పటిష్టంగా ఉంచే కాల్షియం, ఫాస్పరస్ వంటి పోషకాలు, ఫ్లెవనాయిడ్స్ చాలా ఉంటాయి. నేరేడు పండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల మహిళలకు కావల్సిన పోషకాలు అందుతాయి.
ప్రెగ్నెన్సీ మహిళలు నేరేడు పండ్లు తినాలని వైద్యులు సూచిస్తుంటారు. ఎందుకంటే ఇందులో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది. బిడ్డ ఎముకలు పటిష్టంగా ఉంటాయి. నేరేడు పండ్లు తినడం వల్ల తల్లి రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. గర్భం సమయంలో ఒకవేళ రక్తపోటు సమస్య ఉంటే నేరేడు పండ్లు తింటే నియంత్రణలో వచ్చేస్తుంది. ప్రెగ్నెన్సీ మహిళలకు లేదా పీరియడ్స్‌లో ఉన్నవారికి మలబద్ధకం , జీర్ణ సంబంధిత సమస్యలు ఉంటాయి. జీర్ణక్రియ మెరుగుపర్చేందుకు మెటబోలిజం వేగవంతం చేసేందుకు నేరేడు పండ్లు తింటే మంచి ఫలితాలుంటాయి. నేరేడు పండ్లలో ఫోలిక్ యాసిడ్, ఫ్యాట్స్, ప్రోటీన్లు, సోడియం చాలా ఎక్కువగా ఉంటాయి. గర్భిణీ మహిళలు నేరేడు పండ్లు తినాలని సూచిస్తుంటారు.
Also read: Health Tips: ఆకలేయడం లేదని తేలిగ్గా తీసుకోవద్దు, ప్రమాదకర వ్యాదికి కారణం కావచ్చు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook