Stress Relief Foods: మనిషి ఆరోగ్యం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి శారీరక ఆరోగ్యం, రెండవది మానసిక ఆరోగ్యం. రెండూ చాలా ముఖ్యం. అప్పుడే మనిషి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండగలుగుతాడు. మానసికంగా ఆరోగ్యంగా లేకపోతే ప్రమాదకరంగా మారవచ్చు. అందుకే మానసిక అనారోగ్యాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్లు, నిద్ర లేమి, పని ఒత్తిడి, చికాకు, పని వేళలు అన్నీ కలిపి మానసి‌గా చాలా ఒత్తిడి, ఆందోళనకు గురవుతుంటాం. దాదాపుగా ప్రతి ఒక్కరికీ ఏదో ఒక రూపంలో ఒత్తిడి లేదా ఆందోళన ఉండవచ్చు. కొందరిది పరీక్షల టెన్షన్ అయితే మరి కొందరికి ఆర్ధిక ఇబ్బందుల టెన్షన్. ఇంకొందరిది డబ్బులు సంపాదించేందుకు ఉరుకులు పరుగులు పెట్టే టెన్షన్. కుటుంబ సమస్యలు, ప్రేమికుల సమస్యలు కూడా ఆందోళన, ఒత్తిడికి దారితీస్తుంటాయి. ఇలా ఒత్తిడికి కారణాలు చాలానే ఉంటాయి. ఒత్తిడిని సకాలంలో అధిగమించలేకపోతే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడవచ్చు. హెల్తీ డైట్ తీసుకోవడం ద్వారా ఒత్తిడిని జయించవచ్చంటున్నారు మానసిక వైద్య నిపుణులు. నిత్యం ఎదురయ్యే ఒత్తిడిని జయించేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం..


ఒత్తిడిని అధిగమించే పదార్ధాల్లో డ్రై ఫ్రూట్స్ ముందుగా చెప్పుకోవాలి. ఇందులో బాదం మరీ కీలకం. రోజూ నిర్ణీత పద్థతిలో బాదం, వాల్‌నట్స్, అంజీర్, పిస్తా వంటివి తింటుంటే మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఏ విధమైన ఒత్తిడికి లోనయ్యే అవకాశముండదు. ఇక రోజూ క్రమం తప్పకుండా పాలు తాగడం కూడా శారీరక ఆరోగ్యానికే కాకుండా మానసిక ఆరోగ్యానికి సైతం మంచిది. ఇందులో ఉండే పోషకాలు మానసికంగా మిమ్మల్ని బలంగా ఉంచుతాయి. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అయితే రోజూ రాత్రి వేళ క్రమం తప్పకుండా తాగితే మంచి ఫలితాలుంటాయి.


ఇక ఆకుకూరల్లో ప్రముఖంగా చెప్పుకోవల్సింది పాలకూర. ఇందులో ఉండే జింక్, మెగ్నీషియం, ఐరన్, మాంగనీస్ వంటి న్యూట్రియంట్లు మెదడులో ఆక్సిజన్ స్థాయిని పెంపొందిస్తాయి. అదే సమయంలో హ్యాపీ హార్మోన్ విడుదల చేస్తాయి. దీంతో చికాకు వంటివి దూరమౌతాయి. వారంలో కనీసం 3 సార్లు పాలకూర ఉండేట్టు చూసుకోవాలి. మరో ముఖ్యమైన ఆకు కూర బ్రోకలీ. కాలిఫ్లవర్ లేదా క్యాబేజ్ జాతికి చెందిన బ్రోకలీ లీ‌ఫీ వెజిటబుల్ విభాగంగా ప్రముఖంగా చెప్పుకోవల్సిన ఫైబర్ రిచ్ పదార్ధం. ఆరోగ్యానికి చాలా మంచిది. బ్రోకలీలో ఉండే ఫోలేట్ డిప్రెషన్౨ను దూరం చేసేందుకు దోహదపడుతుంది. 


ఇక అందరికీ తెలిసిన అద్భుతమైన వస్తువు వాము. ప్రతి వంట ఇంట్లో తప్పకుండా లభించే పదార్ధమిది. ఇదొక ఆయుర్వేద మసాలా పదార్ధం. కడుపు సంబంధిత సమస్యల్ని దూరం చేసేందుకు వాము విస్తృతంగా ఉపయోగిస్తుంటారు. అయితే వాముతో మూడ్ కూడా సరి చేసి మానసిక సమస్యల్ని దూరం చేయవచ్చని చాలా తక్కువమందికి తెలుసు. వాము నీరు తాగడం వల్ల ప్రశాంతమైన నిద్ర పడుతుంది.


Also read: Diabetes Foods: ఈ ఐదు పదార్ధాలు రోజూ తింటే చాలు, బ్లడ్ షుగర్ ఎంత ఉన్నా తగ్గిపోతుంది



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook