Diabetes Foods: డయాబెటిస్ వ్యాధికి పూర్తి చికిత్స లేనేలేదు. కేవలం నియంత్రణ మాత్రమే సాధ్యం. నియంత్రణ ఎంత సులభమో నిర్లక్ష్యం వహిస్తే అంతే ప్రమాదకరం. ఆహారపు అలవాట్లపై పూర్తిగా శ్రద్ధ పెట్టకపోతే పరిస్థితి విషమిస్తుంది. ప్రమాదకరమై ప్రాణాంతకం కావచ్చు. మరి ఈ సమస్యకు పరిష్కారమేంటి..
డయాబెటిస్ నియంత్రించాలంటే ఆహారపు అలవాట్లను పూర్తిగా క్రమబద్ధీకరించుకోవాలి. ఎలాంటి ఆహారం తినవచ్చు, ఎలాంటి ఆహారం తినకూడదనేది పూర్తిగా పరిశీలించాలి. ఎందుకంటే డయాబెటిస్ అనేది పూర్తిగా లైఫ్‌స్టైల్ వ్యాధి. అందుకే తినే ప్రతి పదార్ధం పరిశీలించి తినాల్సి వస్తుంది. కాస్త కష్టమైనా తప్పదు. ఎందుకంటే ఏ చిన్న పొరపాటు జరిగినా బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఫలితంగా మందులపై ఆధారపడాల్సి వస్తుంది. అందుకే మధుమేహాన్ని నియంత్రించేందుకు ఫైబర్ పుష్కలంగా ఉండే ఆహార పదార్ధాలను ఎక్కువగా తీసుకోవాలి. ఫైబర్ అత్యధికంగా ఉండే ఆహారం వల్ల రక్తంలో చక్కెర శాతం నియంత్రణలో ఉంటుంది. అందుకే ఫైబర్ పదార్ధాలను డైట్‌లో భాగంగా చేసుకోవాలి. అప్పుడే బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి.
జాంకాయలు
డయాబెటిస్ వ్యాధిగ్రస్థులకు జాంకాయలు అద్భుతంగా పనిచేస్తాయి. ఎందుకంటే వీటిలో ఫైబర్ కావల్సినంత ఉంటుంది. ప్రత్యేకించి లిక్విఫైడ్ ఫైబర్. మరోవైపు జాంకాయ గ్లైసోమిక్ ఇండెక్స్ కూడా తక్కువ కావడంతో నిరభ్యంతరంగా తినవచ్చు. జాంకాయల్ని ఎలా ఏ రూపంలోనైనా తీసుకోవచ్చు.
మెంతులు
మెంతుల ఉపయోగం డయాబెటిస్ నియంత్రణలో అనాదిగా వస్తోంది. మెంతులు తినడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. దీనికోసం మెంతి గింజల్ని రాత్రి వేళ నీళ్లలో నానబెట్టి ఉదయం లేచిన వెంటనే పరగడుపున ఆ మెంతుల్ని క్రష్ చేసి నీళ్లతో సహా తినేయాలి. ఇందులో ఉండే ఫైబర్ మధుమేహాన్ని నియంత్రించడంలో అద్బుతంగా ఉపయోగపడుతుంది.
బ్రోకలీ
బ్రోకలీలో ఫైబర్, విటమిన్లు, మినరల్స్ చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి. బ్రోకలీ గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువ కావడంతో బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రించేందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. బ్రోకలీని ఏ రూపంలో తీసుకున్నా ఫరవాలేదు. మధుమేహం వ్యాధిగ్రస్థులు వారానికి కనీసం 4 సార్లు బ్రోకలీ తీసుకునేట్టు డైట్‌లో భాగం చేసుకోవాలి.
చియా సీడ్స్
చియా సీడ్స్ అనేవి సర్వరోగ నివారిణిగా చెప్పవచ్చు. ఇందులో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. నీళ్లలో కాస్సేపు నానబెట్టి మద్యాహ్నం భోజనానికి , ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కు అరగంట ముందు తీసుకుంటే చాలు. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి.
పాలకూర, ఆకు కూరలు
పాలకూర అనేది ఒక లీఫీ వెజిటెబుల్. ఇందులో ఫైబర్‌తో పాటు ఇతర పోషక పదార్ధాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇందులో గ్రైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో అద్బుతంగా దోహదపడతాయి. పాలకూరను సాధారణంగా కూర రూపంలోనే ఎక్కువగా తీసుకుంటారు.
Also read: Cholesterol: గుడ్లు తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందా లేదా, ఏది నిజం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook