Diabetes Tips: సులభమైన ఈ చిట్కాలు పాటిస్తే బ్లడ్ షుగర్ ఎంతున్నా నియంత్రణ సాధ్యమే
Diabetes Tips: ఆధునిక జీవనశైలి వ్యాధుల్లో డయాబెటిస్ అతి ప్రమాదకరమైంది. ఇప్పటికీ సరైన చికిత్స లేని వ్యాధి కావడంతో నియంత్రణ ఒక్కటే మార్గం. మధుమేహం నియంత్రణకు ఏం చేయాలి, అందుబాటులో ఉన్న సులభమైన పద్ధతులేంటనేవి తెలుసుకుందాం..
Diabetes Tips: మధుమేహం ఎంత ప్రమాదకరమైన వ్యాధి అయినా నియంత్రణ మాత్రం పూర్తిగా మన చేతుల్లో ఉన్నదే. ఎందుకంటే వివిధ రకాల ఆహారపు అలవాట్లు, చెడు జీవన విధానమే మధుమేహానికి కారణమౌతుంటుంది. అందుకే ఆహారపు అలవాట్లను నియంత్రిస్తే మధుమేహం నియంత్రణ సాధ్యమే. ఆ చిట్కాలు తెలుసుకుందాం.
దేశంలోనే కాదు ప్రపంచమంతా చాపకింద నీరులా విస్తరిస్తున్న అతి ప్రమాదకర వ్యాది డయాబెటిస్ బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగడం. 135 కోట్ల జనాభాలో 10 కోట్లమందికి డయాబెటిస్ ఉందంటే పరిస్థితి తీవ్రత ఎలా ఉందో అర్దం చేసుకోవచ్చు. ఆధునిక జీవన విధానంలో వస్తున్న మార్పులు, నిద్ర లేమి, స్థూలకాయం, జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్ వంటివి మధుమేహానికి ప్రధాన కారణాలు. శరీరక శ్రమ లేకపోవడం మరో ముఖ్య కారణంగా ఉంది. ఇక ప్రీ డయాబెటిస్ వ్యాధిగ్రస్థులు దేశంలో 13.6 కోట్లు ఉన్నారు. దేశంలో మధుమేహం వ్యాధికి గురైన వారిలో 90 శాతం మంది టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడుతున్నారు.
డయాబెటిస్ నియంత్రించాలంటే డైట్ ప్లాన్ ఉండాలి. ముఖ్యంగా ప్రోటీన్లు, కొవ్వు పదార్ధాలు సమంగా తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ లేకుండా చూసుకోవాలి. దీనికోసం కూరగాయలు, తృణ ధాన్యాలు ఎంచుకోవాలి. బెర్రీలు, ఆపిల్ వంటి లో గ్లైసెమిక్ ఫ్రూట్స్ మాత్రమే తినాలి. జ్యూస్ కంటే నేరుగా పండ్లు తినడం మంచిది. రెట్ మీట్ కంటే లీన్ మీట్, ఫిష్ మంచిది.
ఇక స్నాక్స్ రూపంలో పండ్లు, కూరగాయలు తించే చాలా మంచిది. మెరుగైన ఫలితాలు కన్పిస్తాయి. రోజూ నిర్ణీత సమయంలో వాకింగ్ లేదా వ్యాయామం చేయాల్సి ఉంటుంది. రోజుకు కనీసం 40 నిమిషాలు వాకింగ్ అవసరం. శారీరక శ్రమ ఉండాలి. అధిక బరువు ఉంటే తగ్గించుకోవాలి. కొలెస్ట్రాల్ పదార్ధాలకు దూరంగా ఉండాలి.
Also read: Drinking Water: భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగితే ఏమౌతుంది, ఎలాంటి సమస్యలు ఏర్పడతాయి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook