రోజూ పండ్లు తినే అలవాటుంటే ఫిట్ అండ్ స్లిమ్‌గా ఉంటారు. ఆరోగ్యం కూడా ఉంటుంది. చాలా రకాల వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి. డైటింగ్ నిమిత్తం కూడా చాలామంది ఫ్రూట్ సలాడ్ తీసుకుంటుంటారు. అయితే ఫ్రూట్ సలాడ్‌లో కలిపే పండ్లు ఎలాంటివనేది పరిశీలించాల్సి ఉంటుంది. ఎందుకంటే కొన్ని రకాల పండ్లు కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏయే పండ్లను కలిపి తినకూడదు


ఆరెంజ్-క్యారట్


ఆరెంజ్, క్యారట్ కాంబినేషన్ ఆరోగ్యానికి మంచిది కాదు. ఆరోగ్యానికి ముప్పుగా పరిణమిస్తుంది. ఈ రెండింటినీ ఒకేసారి తీసుకోవడం వల్ల గుండె మంట సమస్య ఏర్పడుతుంది. కిడ్నీలు పాడయ్యే అవకాశం కూడా లేకపోలేదు. 


జామ-అరటి


జాంకాయం, అరటి కలిపి తీసుకోవడం మంచిది కాదు. ఈ కాంబినేషన్ ఆరోగ్యానికి సమస్యగా మారుతుంది. ఈ రెండు పండ్లను కలిపి ఒకేసారి తినడం వల్ల ఎసిడిటీ, తలనొప్పి వంటి సమస్యలు ఉత్పన్నమౌతాయి.


పైనాపిల్-పాలు


పైనాపిల్‌లో బ్రోమెలెన్ పోషక పదార్ధముంటుంది. ఇది ఓ రకమైన ఎంజైమ్. పైనాపిల్ రసం నుంచి వస్తుంది. దీనిని పాలతో కలపడం వల్ల గ్యాస్, వాంటింగ్ సెన్సేషన్ వంటి సమస్యలు రావచ్చు.


బొప్పాయి-నిమ్మ


చాలామందికి పండ్లపై నిమ్మరసం పిండుకునే అలవాటుంటుంది. కానీ బొప్పాయిపై పొరపాటున కూడా అలా చేయవద్దు. అంటే బొప్పాయిపై నిమ్మరసం పిండటం మంచిది కాదు. ఎందుకంటే బొప్పాయి, నిమ్మకాయ అనేది ప్రమాదకర కాంబినేషన్. ఎనీమియా, హిమోగ్లోబిన్ సమస్య ఉత్పన్నం కావచ్చు.


వెజిటబుల్స్-కూరగాయలు


పండ్లతో కూరగాయల్ని కలిపి తీసుకోవడం కూడా మంచిది కాదు. కడుపులో విష పదార్ధంగా మారుతుంది. ఫలితంగా అజీర్తి, తలనొప్పి, విరేచనాలు వంటి సమస్యలు రావచ్చు.


Also read: Cholesterol: ఈ మూడు కూరగాయలు రోజూ తీసుకుంటే కొలెస్ట్రాల్ ఇట్టే మాయం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook