Kidney Donation: కిడ్నీ దానం చేశాక సాధారణ జీవితం సాధ్యమేనా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
Kidney Donation: మనిషి శరీరంలో అత్యంత ముఖ్యమైన అంగాల్లో కిడ్నీలు ఒకటి. గుండె ఎంత ముఖ్యమో కిడ్నీలు కూడా అంతే ప్రాధాన్యత కలిగినవి. కిడ్నీల పనితీరు ఏ మాత్రం దెబ్బతిన్నా ప్రాణాంతకం కాగలదు. బహుశా అందుకే ప్రతి మనిషికి రెండు కిడ్నీలు ఉంటాయి.
Kidney Donation: మనిషి శరీరంలో కిడ్నీల పాత్ర చాలా కీలకమైనందునే ప్రతి మనిషికి రెండు కిడ్నీలుంటాయంటారు. శరీరంలో విష పదార్ధాల వడపోత జరిగేది అక్కడే. కిడ్నీలు ఆరోగ్యంగా ఉన్నంతవరకే మనిషి ఆరోగ్యం ఉంటుంది. కిడ్నీల్లో ఏ సమస్య తలెత్తినా ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమౌతుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
కిడ్నీలకు సంబంధించి చాలామందిలో కొన్ని అపోహలు కావచ్చు సందేహాలు కావచ్చు ఉన్నాయి. ఇంట్లో కుటుంబసభ్యులకు రెండు కిడ్నీలు విఫలమైనప్పుడు కిడ్నీ అవసరమైనప్పుడు ఎవరో ఒకరు కిడ్నీ దానం చేయడాన్ని తరచూ వింటుంటాం. ఇది సహజంగా జరిగే ప్రక్రియే. అయితే ఇలా కిడ్నీ దానం చేయడం వల్ల ఆ మనిషి సాధారణ జీవితం సాధ్యమౌతుందా లేదా అనేది ప్రధానమైన సందేహం. శరీరంలో అంగాన్ని దానం చేసే వ్యక్తిని అతి ముఖ్యమైన వ్యక్తిగా పరిగణిస్తారు. వైద్య రంగంలో అంగ మార్పిడి ప్రక్రియలో అంగదాత సంరక్షణకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అంగదాత ఎప్పుడూ అదే కుటుంబానికి చెందిన వ్యక్తి తల్లి, తండ్రి, సోదరుడు, సోదరి, కుమారుడు, కుమార్తెల్లో ఒకరై ఉంటారు. అది కాకుండా రోగి సమీప బంధువులు తమకు తాముగా అంగ దానం చేయవచ్చు. అంగాన్ని దానం చేయాలంటే కనీస వయస్సు 18 ఏళ్లు కాగా గరిష్టంగా 70 ఏళ్లు అవసరం.
కిడ్నీ దానం చేసే వ్యక్తికి డయాబెటిస్, హార్ట్ ఎటాక్ లేదా కేన్సర్ వంటి ప్రమాదకర వ్యాధి లేకుండా ఉండాలి. ఆ వ్యక్తి కిడ్నీల పనితీరు బాగుండాలి. ఎందుకంటే ఒక కిడ్నీ దానం చేసినా సరే మరో కిడ్నీతో సాధారణ జీవితం గడపగలగాలి. కిడ్నీ మార్పిడి చేసేటప్పుుడు కూడా చాలా రకాల పరీక్షలు నిర్వహించిన తరువాత కిడ్నీ మార్పిడి జరుగుతుంది.
కిడ్నీ మార్పిడి అనేది బతికున్న వ్యక్తి నుంచి సేకరించి తీసుకునేది. మనిషి ఆనందంగా, ఆరోగ్యంగా బతికేందుకు హెల్తీగా ఒక్క కిడ్నీ ఉన్నా సరిపోతుంది. రెండవ కిడ్నీ ఎప్పుడూ ఆ మనిషికి అదనంగా ఉండేదే. ఒకరికి దానం ఇచ్చినంత మాత్రాన ఆ వ్యక్తి ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపించదు. మనిషి శరీరంలో రెండు కిడ్నీలు చేసేపనిని ఒక కిడ్నీ కూడా చేయగలదు. రెండు కిడ్నీలుంటే చెరో 50 శాతం పని చేస్తాయి. ఎవరైనా వ్యక్తి ఒకే కిడ్నీతో పుడితే లేదా ఒక కిడ్నీ దానం చేసుంటే ఆ వ్యక్తి కిడ్నీ 75 శాతం వరకూ పనిచేస్తుంది. అందుకే ఒక కిడ్నీ దానం చేసినా ఆ వ్యక్తి జీవన విదానంలో ఏ మార్పు ఉండదంటారు.
కిడ్నీ మార్పిడికి ముందు ఆ వ్యక్తికి చాలా పరీక్షలు నిర్వహిస్తారు. దాత ఆరోగ్యం ఎలా ఉంది, ఒక కిడ్నీ దానం చేసిన తరువాత ఆ వ్యక్తి ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడకుండా ఉంటుందా, సర్జరీ జరిగిన కొన్ని రోజులకే సాధారణ జీవితం సాధ్యమౌతుందా అనేది నిర్దారణ చేస్తారు. కిడ్నీ దానం చేసిన తురవాత ఆ వ్యక్తి ఆరోగ్యంగా మారేందుకు కొద్దిగా సమయం పడుతుంది. అలసట, బలహీనత, వ్యక్తిగత సమస్యలు 1-2 నెలల వరకూ ఉండవచ్చు. కిడ్నీ దానం తరువాత ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.
కిడ్నీ దానం చేసిన తరువాత జీవనశైలి ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి. హెల్తీ ఫుడ్స్ మాత్రమే తీసుకోవాలి. రోజూ తేలికైన వ్యాయమం చేస్తుండాలి. కిడ్నీ దానం చేసిన తరువాత రోజువారీ చేసే పనుల్లో ఏ మార్పు రాదు. కానీ మీ సామర్ధ్యానికి అనుగుణంగానే పనిచేయాల్సి ఉంటుంది. కిడ్నీ దానం చేసిన తరువాత మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. బాధ, ఒత్తిడి, ఆందోళనకు దూరంగా ఉండాలి. లేకపోతే ఆరోగ్యం పాడవుతుంది.
ఏదైనా ఇతర సాధారణ ఆరోగ్య సమస్యలకు మందులు వాడేముందు వైద్యుడిని సంప్రదించి వాడాల్సి ఉంటుంది. రోజూ తగిన పరిమాణంలో నీళ్లు తాగాల్సి ఉంటుంది. కిడ్నీ దానం చేసిన తరువాత ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ మాత్రం అవసరం. కానీ సాధారణ జీవితం ఆనందంగా సాగిపోతుంది. ఏ ప్రభావం పడదు. కిడ్నీ దానం చేయడం వల్ల ఓ వ్యక్తి ప్రాణాలు నిలబడటమే కాకుండా ఆరోగ్యంపై ఏ విధమైన దుష్ప్రభావం పడకుండా ఉంటుంది.
Also read; Fever & Bath: జ్వరంతో బాధపడుతున్నప్పుడు స్నానం చేయవచ్చా లేదా, ఏమౌతుంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook