Dry Eye Syndrome: ప్రపంచవ్యాప్తంగా కంటి సమస్య అధికమౌతోందని వివిధ అధ్యయనాలు చెబుతున్నాయి. కంటి వెలుగు బలహీనంగా ఉన్నవారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 2.2 బిలియన్లు ఉందని అంచనా. సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఇప్పటికైనా అందులో సగం మంది కంటి చూపు కాపాడుకోవచ్చు. ఆ వివరాలు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆధునిక పోటీ ప్రపంచం లేదా గ్యాడ్జెట్స్‌పై మక్కువ కారణం ఏమైనప్పటికీ ఇటీవలి కాలంలో కంప్యూటర్, ల్యాప్‌టాప్, మొబైల్, టీవీలకు అతుక్కుపోతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా మొబైల్ ఫోన్ అలవాటు మరింతగా ఉంటోంది. రోజంతా బ్లూ స్క్రీన్‌కు మీ కళ్లు ప్రభావితమైపోతున్నాయి. అందుకే ఇటీవలి కాలంలో కంటి సంబంధిత సమస్యలు పెరిగిపోతున్నాయి. ఈ సమస్యల్లో ఒకటి డ్రై ఐ సిండ్రోమ్. ఈ సమస్య ఇప్పుడు సాధారణమైపోయింది. అంటే కంట్లో తడి పోతుంది. కళ్లు పొడిగా మారిపోతాయి. ఈ సమస్యకు వయస్సుతో సంబంధం లేదు. పురుషులతో పోలిస్తే మహిళల్లో ఎక్కువగా కన్పిస్తోంది. 


డ్రై ఐ సిండ్రోమ్‌కు ప్రధానంగా రెండు కారణాలు చెప్పుకోవచ్చు. మొదటిది కంట్లోంచి కన్నీరు రాకపోవడం, రెండవది కంట్లో కన్నీరు అత్యంత వేగంగా బయటికి రావడం. కళ్లు ఎండిపోకుండా ఉండాలంటే కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ లేదా మొబైల్ వాడేటప్పుడు కళ్లు మధ్య మధ్యలో ఆడిస్తుండటం, కళ్లద్దాలు ధరించడం, పొగ చూరే ప్రాంతాల్లో కళ్లు ఫోకస్ కాకుండా చూడటం వంటివి అలవాటు చేసుకోవాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం 2.2 బిలియన్ల మందికి కంటి చూపు సరిగ్గా లేదు. అయితే తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఇందులో సగం మంది కంటి చూపును రక్షించుకోవచ్చు. డ్రై ఐ సిండ్రోమ్ కూడా కంటి చూపును తగ్గించేస్తుంది. 


డ్రై ఐ సిండ్రోమ్‌కు డయాబెటిస్‌తో లింక్ ఉందా


డయాబెటిస్ , డ్రై ఐ సిండ్రోమ్ మధ్య సంబంధముందని కొన్ని అధ్యయనాల ద్వారా తేలింది. మధుమేహ వ్యాధిగ్రస్థుల్లో ఈ సమస్య అధికంగా ఉందని తెలుస్తోంది. దాదాపు వేయిమందిపై ఈ అధ్యయనం నిర్వహించారు. డయాబెటిస్ వ్యాధి సోకిన వారి కళ్లలో కన్నీరు తక్కువగా వస్తోందని తెలిసింది. బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు కన్నీరు తయారు చేసే గ్లాండ్స్ దెబ్బతినడం గమనించారు అందుకే డ్రై ఐ సిండ్రోమ్ సమస్య పెరుగుతోంది. 


డ్రై ఐ సిండ్రోమ్ లక్షణాలు, చికిత్స


కళ్లలో మంట, దురద, కళ్లలో తరచూ పుసి ఏర్పడటం, కళ్లు ఎర్రబడటం, రాత్రి కన్పించకపోవడం, కంట్లోంటి నీరు కారడం, చూపు మందగించడం ప్రధాన లక్షణాలుగా ఉన్నాయి. డ్రై ఐ సిండ్రోమ్ సమస్య ఉన్నప్పుడు లేదా ఈ లక్షణాలు కన్పించినప్పుడు గాలి నేరుగా కంటికి తగలకుండా కళ్లద్దాలు ధరించాలి. స్మోకింగ్‌కు దూరంగా ఉండాలి. పని చేసేటప్పుడు మధ్య మధ్యలో కళ్లకు విశ్రాంతి ఇవ్వాలి. టీవీ, మొబైల్, కంప్యూటర్ చూసేటప్పుడు కంటి రెప్పలు ఆడిస్తుండాలి. గది ఉష్ణోగ్రత సాధారణంగా ఉంచాలి. ఆర్టిఫిషియల్ టియర్స్ , ఐ డ్రాప్స్ వాడాలి. కళ్లు శుభ్రంగా ఉంచుకోవాలి.


Also read: Corona New Variant: భయపెడుతున్న కరోనా కొత్త వేరియంట్, పేరేంటో తెలుసా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook