Liver Damage Symptoms: శరీర అవయవాల్లో అతి ముఖ్యమైన లివర్ ఆరోగ్యంగా ఉందో లేదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇది ఎలా తెలుసుకోవడమనేదే అసలు సమస్య. అయితే లివర్‌లో సమస్య ఉంటే కొన్ని లక్షణాల ద్వారా సులభంగా గుర్తించవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ లక్షణాల్ని నిర్లక్ష్యం చేస్తే మాత్రం మూల్యం చెల్లించుకోవల్సి వస్తుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సాధారణంగా శరీరంలోని వివిధ అవయవాల్లో సమస్య ఏర్పడితే వివిధ లక్షణాల రూపంలో బయటపడుతుంటుంది. అదే విధంగా లివర్ పాడయినప్పుడు కూడా కొన్ని లక్షణాలను బట్టి గుర్తించవచ్చు. ముఖ్యంగా చేతి వేళ్ల గోర్లను చూసి లివర్ ఆరోగ్యాన్ని అంచనా వేయవచ్చంటున్నారు. లివర్ పాడవడం అంటే చాలా సీరియస్ సమస్యగానే పరిగణించాల్సి వస్తుంది. ఎందుకంటే లివర్‌లో సమస్య ఏర్పడితే ఆ ప్రభావం అన్ని అవయవాల పనితీరుపై పడుతుంటుంది. శరీరంలో విష పదార్ధాలు బయటకు తొలగించే పని చేసేది లివర్ మాత్రమే. జీర్ణక్రియ, గుడ్ కొలెస్ట్రాల్, రెడ్ బ్లడ్ సెల్స్ నిర్మాణంలో కూడా లివర్ పాత్ర చాలా కీలకం. అందుకే లివర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.


వాస్తవానికి శరీరంలో ఏ ఇతర అవయవానికి లేనట్టుగా లివర్‌కు రీ జనరేటెడ్ సామర్ధ్యం ఉంటుంది. కానీ దీర్ఘకాకాలంగా చెడు ఆహారపు అలవాట్లు, చెడు అలవాట్లు, చెడు జీవనశైలికి అలవాటు పడితే మాత్రం లివర్ ఆరోగ్యంగా మనజాలదు. అందుకే కొన్ని సంకేతాల ద్వారా లివర్ ఆరోగ్యంగా ఉందో లేదే పసిగట్టవచ్చు. 


లివర్ చెడిపోతే గోర్లు బలహీనంగా మారవచ్చు. గోర్లు చివర్లు త్వరత్వరగా విరిగిపోతుంటాయి. అంతకాకుండా గోర్ల ఆకారంలో మార్పు వస్తుంది. గోర్లు అణిగిపోయి లేదా చర్మంలో ఇరుక్కుపోయినట్టుగా కన్పిస్తుంది. ఇలా ఉంటే కచ్చితంగా లివర్ ఆరోగ్యంగా లేనట్టుగా అర్ధం చేసుకోవాలి. 


లివర్ పాడయితే గోర్ల రంగులో మార్పు స్పష్టంగా కన్పిస్తుంది. సహజసిద్ధమైన రంగును కోల్పోయిన పసుపుగా మారవచ్చు. గోర్లలో కన్పించే తెలుపుభాగం కూడా మాయమౌతుంది. లివర్ ఆరోగ్యంగా ఉంటే గోర్లు చక్కగా ఉంటాయి. లివర్ ఆరోగ్యం చెడితే మాత్రం గోర్లపై గోధుమ లేదా పసుపు రంగు గీతలు కన్పిస్తాయి. గోర్లు కాకుండా ఇంకా ఇతర లక్షణాలు కూడా కొన్ని ఉన్నాయి. లివర్ పాడయితే చర్మం పసుపుగా మారడం, కళ్లు తెల్లబడటం గమనించవచ్చు. చర్మం సహజరంగును కోల్పోతుంది.కడుపులో నొప్పి ఉంటుంది. కాళ్లు, మడమల్లో నొప్పి ఉంటుంది. చర్మం దురద, మూత్రం చిక్కగా ఉండటం, అదేపనిగా అలసట, వికారం, వాంతులు ఆకలి తగ్గడం వంటివి ఉంటాయి.


Also read: IT Returns 2024: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఇంట్లోంచి ఎలా ఫైల్ చేయాలి, ఏమేం అవసరం



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook