IT Returns 2024: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఇంట్లోంచి ఎలా ఫైల్ చేయాలి, ఏమేం అవసరం

IT Returns 2024: కొత్త ఆర్ధిక సంవత్సరం ప్రారంభమౌతూనే ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ దాఖలు చేసే సమయం కూడా వచ్చేసింది. మరో  మూడు నెలల వరకూ ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేందుకు గడువు మిగిలుంది. ఈ నేపద్యంలో ఆన్‌లైన్‌లో ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఎలా దాఖలు చేయాలి, ఏమేం అవసరమనేది తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 18, 2024, 05:44 PM IST
IT Returns 2024: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఇంట్లోంచి ఎలా ఫైల్ చేయాలి, ఏమేం అవసరం

IT Returns 2024: ఉద్యోగస్థులు, వ్యాపారస్థులు మళ్లీ ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే సమయం ఆసన్నమైంది. 2024 జూలై 31లోగా 2023-24 ఆర్ధిక సంవత్సరంతో పాటు 2024-25 అసెస్‌మెంట్‌కు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఉద్యోగస్థులతై ఇందుకోసం ఫారమ్ 16 సేకరించే పనిలో ఉన్నారు. ఈ నేపధ్యంలో ఐటీ రిటర్న్స్ ఆన్‌లైన్‌లో ఎలా ఫైల్ చేయాలనేది పరిశీలిద్దాం.

వాస్తవానికి ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ దాఖలు చేయడం పెద్ద కష్టమేం కాదు. అన్ని కాగితాలు సక్రమంగా ఉంటే చాలా సులభంగా ఆన్‌లైన్ విధానంలో ఇంట్లో కూర్చుని ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ దాఖలు చేయవచ్చు. ఇప్పుడు తిరిగి ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాల్సిన సమయం ఆసన్నమైంది. 2023-24 అంటే గత ఆర్ధిక సంవత్సరపు రిటర్న్స్, రానున్న ఆర్ధిక సంవత్సరం 2024-25 అసెస్‌మెంట్ జూలై 31వ తేదీలోగా దాఖలు చేయాల్సి ఉంటుంది. దీనికోసం ఉద్యోగులకు ఫారమ్ 16 కావల్సి ఉంటుంది. సదరు ఉద్యోగులు ఈ ఫారమ్ 16ను తాము పనిచేసే సంస్థ నుంచి పొందాల్సి ఉంటుంది. హెచ్‌ఆర్‌ను సంప్రదిస్తే ఇది అందుతుంది. ఇది ఉంటే చాలు ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ క్షణాల్లో ఆన్‌లైన్ విధానంలో ఫైల్ చేయవచ్చు.

ముందుగా ఇన్‌కంటాక్స్ శాఖ అధికారిక వెబ్‌సైట్ https://www.incometax.gov.in/iec/foportal/ ఓపెన్ చేయాలి. ఇప్పుడు మీ పాన్ నెంబర్, పాస్‌వర్డ్ ఆధారంగా లాగిన్ అవండి. తరువాత File Income tax Returns ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు అసెస్‌మెంట్ ఇయర్ ఎంచుకోవాలి. అంటే 2023-24 ఆర్ధిక సంవత్సరం రిటర్న్స్ దాఖలు చేస్తున్నట్టయితే అసెస్‌మెంట్ ఇయర్ 2024-25 ఎంచుకోవల్సి ఉంటుంది. తరువాత ఐటీ రిటర్న్స్ పర్సనల్ క్లిక్ చేసుకోవాలి. 

మీ పాన్ నెంబర్, ఆధార్ నెంబర్, పేరు, పుట్టిన తేదీ, చిరునామా, బ్యాంక్ ఎక్కౌంట్ వివరాలు ధృవీకరించుకోవాలి. ఇప్పుడు మీ ఆదాయం, పన్ను, మినహాయింపు వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. రిటర్న్స్ ఫైల్ చేసేందుకు తగిన వివరాలతో ధృవీకరించాలి. 

ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ దాఖలు చేసేందుకు పాన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంకు స్టేట్‌మెంట్, ఫారమ్ 16, డొనేషన్ స్లిప్, ఇన్వెస్ట్‌మెంట్ ప్రూఫ్స్, పాలసీ రసీదులు, లోన్ సర్టిఫికేట్, ఎడ్యుకేషన్ ఫీజు రసీదు అవసరమౌతాయి. ఎందుకంటే వీటిపై ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది. వీటితో పాటు నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ వంటి ఇతర సేవింగ్ పధకాలుంటే వాటికి సంబంధించిన పత్రాలు దాఖలు చేయాలి. వాటిపై కూడా ట్యాక్స్ మినహాయింపు పొందవచ్చు. 

Also read: Today Gold Rate: పసిడి ప్రియులకు ఊరట.. తులం బంగారం ధర ఈరోజు ఎంత ఉందంటే?

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News