Dental Care Tips: పళ్లలో కేవిటీ, చిగుళ్లలో రక్తం, నోటి దుర్వాసన బాధిస్తుంటే..ఇలా చేయండి చాలు
Dental Care Tips: మనిషి శరీరంలో అన్ని అంగాలు అత్యంత కీలకం. అన్నీ ఆరోగ్యంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉన్నట్టు అర్ధం. సకల సమస్యలకు మూలద్వారం నోరు. ఈ నోరే శుభ్రంగా లేకపోతే ఎలా మరి. కానీ దురదృష్ఠవశాత్తూ నోటి విషయంలో చాలామంది అజాగ్రత్తగా ఉంటారు.
Dental Care Tips: చాలామంది ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తుంటారు. గుండెను ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవాలి, రక్తపోటు, మధుమేహం సమస్యలు రాకుండా ఏం చేయాలి, కొలెస్ట్రాల్ నియంత్రణకు ఎలాంటి పదార్ధాలు తీసుకోవాలి ఇలా అన్ని విషయాల్లో శ్రద్ధ వహిస్తుంటారు. కానీ పళ్ల ఆరోగ్యంపై మాత్రం ధ్యాస పెట్టరు. ఇది చాలా ప్రమాదకరం.
పళ్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే అధిక శాతం ఇన్‌ఫెక్షన్లు వెంటాడుతాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. నోరు శుభ్రంగా లేకపోవడం వల్ల బ్యాక్టిరియా తినే ఆహారంతో పాటు శరీరంలోని వివిధ భాగాలకు చేరి అనారోగ్యానికి కారణమౌతుంది. పళ్లు ఆరోగ్యంగా లేకపోవడం వల్ల పళ్లు పసుపుగా మరాడం, పాయారియా, కేవిటీ, చిగుళ్లు రక్తం కారడం, నోటి దుర్వాసన వంటి సమస్యలు ఉత్పన్నమౌతాయి. పంటికి సంబంధించిన విషయాల్ని నిర్లక్ష్యం చేయడం మంచిది కాదంటున్నారు వైద్య నిపుణులు. నోరు ఎంత శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంటే మిగిలిన శరీరం అంత ఆరోగ్యంగా ఉంటుందంటారు. పళ్ల సంరక్షణకు ఏం చేయాలో తెలుసుకుందాం..
గుట్కా, పొగాకు బ్యాన్
స్మోకింగ్ ఈజ్ ఇంజ్యూరియస్ టు హెల్త్. స్పష్టంగా కన్పిస్తున్నా అదే పనిగా పొగాకుకు బానిసవుతుంటాం. గుట్కా హానికరమని తెలిసినా వదల్లేకపోతుంటారు. గుట్కా తినడం, పొగాకు నమలడం లేదా స్మోకింగ్ అనేది కేవలం సోషల్ ఈవిల్ మాత్రమే కాదు ఆరోగ్యపరంగా ఏ మాత్రం మంచి అలవాట్లు కావు. ఈ అలవాట్లుంటే పళ్లు, చిగుళ్లు, నాలుకకు చాలా హాని కలుగుతుంది. ఇటీవలి కాలంలో టీనేజ్ నుంచి వృద్ధుల వరకూ అందరికీ ఈ చెడు అలవాటు ఎక్కువగా ఉంది. సాధ్యమైనంత త్వరగా ఈ చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.
డైట్
మనం రోజూ తీసుకునే ఆహారపు అలవాట్లను బట్టి కూడా పళ్ల ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. కొన్ని రకాల ఆహర పదార్ధాలు పళ్లకు అంటిపెట్టుకుని ఉంటాయి. దీనివల్ల బ్యాక్టిరియా పుట్టేందుకు అవకాశాలుంటాయి. ముఖ్యంగా స్వీట్స్ లేదా పళ్లకు అంటుకునే పదార్ధాలు తిన్నప్పుడు ఇలా జరుగుతుంది. ఎప్పుడైతే బ్యాక్టీరియా జన్మిస్తుందో పంటి సమస్యలు ఏర్పడతాయి. పళ్లు పుచ్చిపోవడం వంటి సమస్యలు సాధారణమౌతాయి. అందుకే స్వీట్స్ సాధ్యమైనంతవరకూ మానేయాలి. లేదా స్వీట్స్ తిన్న వెంటనే నోటిని శుభ్రంగా 2-3 సార్లు పుక్కిలించడం లేదా బ్రష్ చేయడం మంచిది.
డెంటల్ చెకప్
మనిషి ఆరోగ్యం విషయంలో ఎప్పటికప్పుడు వివిధ రకాల పరీక్షలు చేయించుకున్నట్టే పళ్ల విషయంలో కూడా అంతే జాగ్రత్త వహించాలి. నెలకు ఒకసారి లేదా రెండుసార్లు డెంటల్ చెకప్ చేయించుకోవడం చాలా అవసరం. ఇలా చేయడం వల్ల పళ్లకు సంబంధించిన చిన్న చిన్న సమస్యలుంటే తెలుస్తుంది లేదా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకునేందుకు వీలవుతుంది.
Also read: Cashews Side Effects: జీడిపప్పు ఆరోగ్యానికి హానికరమా, రోజుకు ఎంత తినాలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook