సాధారణంగా కాళ్లు, చేతులు, మోకాళ్లు, భుజాలు తరచూ నొప్పి వస్తుంటాయి. ఈ నొప్పులకు చాలా కారణాలుంటాయి. రన్నింగ్ లేదా బరువైన వస్తువుల ఎత్తడం సమస్యగా ఉంటుంది. మజిల్స్ సమస్య ఒకసారి ప్రారంభమైతే చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ సమస్య నుంచి ఎలా ఉపశమనం పొందాలో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శరీరంలో తరచూ ఏదో ఒక భాగంలో నొప్పులు వస్తుంటాయి. కొన్ని తేలిగ్గా ఉండవచ్చు. మరికొన్ని తీవ్రంగా ఉండి బాధిస్తుంటాయి. ఈ నొప్పులకు కారణాలు చాలానే ఉంటాయి. అందులో ప్రధానమైంది న్యూట్రియంట్ల లోపం. శరీరాన్ని ఆరోగ్యాన్ని ఉంచేందుకు పోషకాల అవసరం ఉంటుంది. కాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియంలు మజిల్స్, ఎముకల్ని బలంగా, ఆరోగ్యంగా ఉంచేందుకు దోహదపడతాయి. ఇవి లోపించడం వల్ల మజిల్స్ నొప్పి వస్తుంది.


ఎక్కువగా నడిచినా కాళ్ల మజిల్స్‌లో తీవ్రమైన నొప్పి మొదలవుతుంది. ఎక్కువసేపు నిలుచోవడం లేదా నడవడం వల్ల కాళ్లలో అలసట, నొప్పి ఉంటుంది.


ఆటలంటే అందరికీ ఇష్టమే ఉంటుంది. ముఖ్యంగా క్రికెట్, ఫుట్‌బాల్ వంటి ఆటలతో చాలా అలసట ఉంటుంది. ఒత్తిడి నుంచి విముక్తి పొందేందుకు ఆటలు మంచి ప్రత్యామ్నాయాలుగా ఉంటాయి. ఆటల వల్ల మానసిక ఒత్తిడి దూరమైనా..శరీరక ఒత్తిడి పెరిగి నొప్పులు ప్రారంభమౌతాయి.


నిద్రపోయేటప్పుడు సరైన రీతిలో పడుకోకపోయినా మజిల్ పెయిన్స్ బాధిస్తాయి. తప్పుడు పొజీషన్‌లో పడుకోవడం వల్ల మజిల్స్ పట్టేస్తాయి. నొప్పులు మొదలవుతాయి. వ్యాయామం చేసేటప్పుడు దొర్లే పొరపాట్లు కూడా మజిల్స్ పెయిన్‌కు కారణమౌతాయి.


మనిషి శరీరానికి పని ఎంత అవసరమో విశ్రాంతి కూడా అంతే అవసరం. కొంతమంది పనిలో పడి విశ్రాంతిని మర్చిపోతుంటారు. లేదా నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ ఇది చాలా పొరపాటు. విశ్రాంతి లేకుండా నిరంతరం పనిచేస్తుంటే మజిల్స్ పెయిన్ తీవ్రంగా ఉంటుంది. 


మజిల్స్ పెయిన్ దూరం చేసేందుకు నిరంతరం పోషక పదార్ధాలు పుష్కలంగా లభించే ఆహార పదార్ధాలు తీసుకోవాలి. విశ్రాంతికి కూడా సమయం కేటాయించాలి. ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటే..విశ్రాంతికి కూడా తగిన సమయం కేటాయించాలి. వేడి నూనెతో మస్సాజ్ చేయడం వల్ల చాలావరకూ నొప్పుల్నించి ఉపశమనం పొందవచ్చు.


Also read: Diabetes Control: డయాబెటిస్ నియంత్రణలో అద్భుత ఔషధంగా పనిచేసే నట్స్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook