Blood Pressure: ఇటీవలి కాలంలో దేశంలో డయాబెటిస్, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ వంటి సమస్యలు ప్రధానంగా కన్పిస్తున్నాయి. ఈ సమస్యలన్నింటికీ కారణం నిత్యం తీసుకునే వివిధ రకాల ఆహార పదార్ధాలే. ఇవి మన ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపిస్తుంటాయి. అనారోగ్య సమస్యలకు కారణంగా మారుతాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే జీవన విధానం, ఆహార పదార్ధాలు అన్నీ సక్రమంగా ఉండాలి. లేకపోతే వివిధ రకాల అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చెడు ఆహారపు అలవాట్ల కారణంగా తక్కువ వయస్సుకే అధిక రక్తపోటు వంటి సమస్యలు ఉత్పన్నమౌతాయి. అధిక రక్తపోటు అనేది చాలా ప్రమాదకరమైంది. సకాలంలో రక్తపోటును నియంత్రించలేకపోతే గుండెపోటు, కొరోనరీ ఆర్టరీ డిసీజెస్ లేదా ట్రిపుల్ వెస్సెల్ డిసీజ్ వంటి వ్యాధులకు దారి తీస్తుంది. ఈ పరిస్థితి చాలా ప్రమాదకరమైంది. తగిన సమయంలో పరిష్కరించకపోతే మూల్యం చెల్లించుకోవల్సి వస్తుంది. అయితే డైట్‌లో కొన్ని పదార్ధాలు చేరిస్తే అధిక రక్తపోటు సమస్యను సులభంగా తగ్గించవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. 


నువ్వు గింజలను ప్రతిరోజూ క్రమ పద్ధతిలో సేవిస్తే అధిక రక్తపోటు సమస్య చాలా సులభంగా తొలగిపోతుంది. రక్తపోటు నియంత్రణలో వచ్చేస్తుంది. నువ్వులను చాలా విధాలుగా సేవించవచ్చు. మార్కెట్‌లో లభించే కొన్ని రకాల బ్రెడ్స్‌లో నువ్వులుంటాయి. హైపర్ టెన్షన్ సమస్య చాలా సులభంగా పరిష్కారమౌతుంది. 


అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు వంటనూనె కూడా మార్చుకోవాలి. నువ్వుల నూనె చాలా మంచిది. నువ్వుల నూనెతో వంటలు వండితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఉండే న్యూట్రియంట్లు రక్తపోటును సులభంగా నియంత్రిస్తాయి.


చాలామంది రోజూ ఉదయం లేదా సాయంత్రం సలాడ్ సేవిస్తుంటారు. సలాడ్ ఆరోగ్యానికి చాలా మేలు చేకూరుస్తుంది. దీనివల్ల జీర్ణక్రియ అద్భుతంగా మెరుగుపడుతుంది. బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. ఈ సలాడ్ నువ్వు గింజలతో కలిపి సేవిస్తే రక్తపోటు సమస్య కూడా తగ్గిపోతుంది. 


Also read: Diabetes Facts: ఆందోళన రేపుతున్న మధుమేహం, ఈ 10 లక్షణాలుంటే నిర్లక్ష్యం వద్దు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook