Healthy Foods: ఉరుకులు పరుగుల జీవితంలో ఏం తింటున్నామో ఏం తినడం లేదో అర్ధం కాని పరిస్థితి. అందుకే శరీరానికి కావల్సిన పోషకాలు కూడా అందడం లేదు. ఫలితంగా బలహీనత వెంటాడుతోంది. మరి ఈ సమస్య నుంచి విముక్తి పొందాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలనేది పరిశీలిద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుత పోటీ ప్రపంచంలో  వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాం. అన్నింటికీ ప్రధాన కారణం జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు. తినే ఆహార పదార్ధాలు సరిగ్గా లేకపోవడంతో శరీరానికి కావల్సిన పోషకాలు అందడం లేదు. ఫలితంగా బలహీనత వెంటాడుతోంది. చిన్న చిన్న పనులకే విపరీతమైన అలసట, బలహీనపడిపోవడం సాధారణమైపోయింది. అందుకే తినే ఆహార పదార్ధాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. వీక్నెస్ దూరం చేసేందుకు ఎలాంటి పదార్ధాలు డైట్‌లో ఉండాలో తెలుసుకుందాం..


మనిషి శరీరం ఎప్పుడూ ధృఢంగా, పటుత్వంగా ఉండాలి. బక్క పల్చగా ఉంటే ప్రతి చిన్న పనికీ నీరసం ఆవహిస్తుంది. ఈ పరిస్థితులున్నప్పుడు తక్షణం వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది. మందుల ద్వారా బలహీనత దూరం చేసుకోవచ్చు. వీటితో పాటు ప్రతి రోజూ డైట్‌లో తాజా పండ్లు ఉంటే చాలా మంచిది. దీనికోసం డైట్‌లో అరటి పండ్లు, లిచీ, ఆపిల్, దానిమ్మ వంటి పండ్లను సేవించాలి. రోజూ పండ్లు తీసుకునే అలవాటు చేసుకుంటే వీక్నెస్ అనేది ఉండనే ఉండదు. ఎందుకంటే పండ్లలో శరీరానికి కావల్సిన అన్ని పోషకాలు సరైన మోతాదులో ఉంటాయి. 


మరోవైపు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు  ఆకుపచ్చని కూరగాయలు తప్పకుండా తీసుకోవాలి. వారానికి 5-6 సార్లు కూరగాయలు తింటే ఏ విధమైన బలహీనత లేదా నీరసం ఆవహించదు. ఎందుకంటే కూరగాయల్లో చాలా రకాల పోషకాలుంటాయి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు ఇవి కీలకంగా ఉపయోగపడతాయి. అందుకే డైట్‌లో ఆకుపచ్చ కూరగాయల్ని చేర్చుకుంటే ఏ సమస్యా ఉండదు. ముఖ్యంగా పాలకూర, సాగుకూర, ఆనపకాయ, తోటకూర వంటి కూరగాయల్ని డైట్‌లో చేర్చుకోవాలి. రోజూ క్రమం తప్పకుండా కూరగాయలు తీసుకుంటుంటే నీరసం ఉండదు.


పోషకాహార లోపం ఏర్పడితే ప్రోటీన్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే ప్రోటీన్లు శరీరానికి శక్తిని, బలాన్ని ఇస్తాయి. ఫలితంగా బలహీనత, నీరసం అనేవి దూరమౌతాయి. డైట్‌లో గుడ్లు, పన్నీర్, పాలు వంటి పదార్ధాలు చేర్చడం ద్వారా పోషకాహార లోపం లేకుండా చూసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ రోజూ తీసుకుంటే ప్రోటీన్ల లోపమే ఉండదు.


Also read: Monsoon Vegetables: వర్షాకాలం ఈ ఐదు పదార్ధాలకు దూరంగా ఉండండి, లేకపోతే సమస్యలే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook