Monsoon Vegetables: వర్షాకాలం ఈ ఐదు పదార్ధాలకు దూరంగా ఉండండి, లేకపోతే సమస్యలే

Monsoon Vegetables: వర్షాకాలం సమీపిస్తోంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి. వర్షాకాలం కావడంతో వివిధ రకాల వ్యాధులు చుట్టుముట్టనున్నాయి. ఈ పరిస్థితి తలెత్తకుండా ఉండాలంటే బయటి పదార్ధాలు తినకూడదు. 
 

Monsoon Vegetables: అదే సమయంలో వర్షాకాలంలో కొన్ని రకాల కూరగాయలు తినేటప్పుడు ఒకటికి రెండుసార్లు పరిశీలించుకోవాలి. ఎందుకంటే ఈ కూరగాయల్లో వర్షాకాలం తప్పనిసరిగా పురుగు పడుతుంటుంది. అందుకే వర్షాకాలంలో అన్నిరకాల పదార్ధాలు తినడం మంచిది కాదు. ముఖ్యంగా ఈ ఐదు రకాల కూరగాయలకు దూరం పాటిస్తే మంచిది.

1 /5

వర్షాకాలంలో మష్రూం ఆరోగ్యానికి మంచిది కాదు. వీటివల్ల ఇన్‌ఫెక్షన్ వాటిల్లే ముప్పుు ఉంది. కడుపు నొప్పి సంబంధిత సమస్యలు ఉత్పన్నమౌతాయి.

2 /5

వర్షకాలంలో ఆకుకూరల్ని సాధ్యమైనంతవరకూ తగ్గించడం మంచిది. ముఖ్యంగా మెంతి కూర, పాలకూర, తోటకూర వంటివి దూరం పెడితే మంచిది. ఎందుకంటే వీటి ఆకుల్లో చిన్న చిన్న పురుగులు ఉండి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి.

3 /5

కాలిఫ్లవర్‌ను వర్షకాలంలో పూర్తిగా దూరం పెట్టాల్సిందే. లేకపోతే ఆరోగ్యానికి చాలా హానికరంగా మారుతుంది. 

4 /5

ఇక రెండవది క్యాబేజ్. వర్షాకాలంలో క్యాబేజ్ తినకూడదు. ఎందుకంటే వర్షాకాలంలో క్యాబేజ్ నిండా పురుగులు ఎక్కువగా ఉండే అవకాశముంది.

5 /5

వర్షాకాలంలో తినకూడని మరో కూరగాయ వంకాయ. వర్షాకాలంలో పురుగు లేకుండా వంకాయ అనేది ఉండదు.