Teeth Cavity: ఇటీవలి కాలంలో దంత సమస్యలు పెరిగిపోతున్నాయి. లైఫ్‌స్టైల్ సరిగ్గా లేకపోవడం వల్లనే ఈ పరిస్థితి. చెడు ఆహారపు అలవాట్లు, డెంటల్ కేర్ సరిగ్గా లేకపోవడం ముఖ్యమైన కారణాలు. పంటి సమస్యల్ని నిర్లక్ష్యం చేస్తే క్రమంగా ఇతర ప్రమాదకర సమస్యలకు దారి తీయవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మన దేశంలో డెంటల్ కేర్ అనేది చాలా తక్కువ. పంటి సమస్యల్ని నిర్లక్ష్యం చేస్తూ విషమించేవరకూ వదిలేస్తుంటారు. చాలామందికి చిగుళ్ల వ్యాధి ఉంటుంది. చాలా తేలిగ్గా తీసుకుంటుంటారు. పళ్ల సెన్సిటివిటీ మరో సమస్య. సెన్సిటివిటీ లేదా చిగుళ్ల సమస్య వంటివి ఉన్నప్పుడు వెంటనే చికిత్స చేయించుకోకపోతే ప్రమాదకరంగా మారుతుంది. మద్యపానం, సిగరెట్ స్మోకింగ్, గుట్కా, పాన్ వంటి చెడు అలవాట్లు పంటి సమస్యలపై ప్రభావం చూపిస్తాయి. సాధారణంగా ఈ సమస్యలు రూరల్ ప్రాంతాల్లో ఎక్కువగా కన్పిస్తాయి. నగరాలు, పట్టణాల్లో అయితే జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ కారణంగా పంటి సమస్యలు ఎదుర్కొంటారు. అనారోగ్యకరమైన ఆహారం, స్వీట్స్ ఎక్కువగా తీనడం కూడా మరో ప్రధాన కారణం. 


అందుకే దంత వైద్యులు పదే పదే ఓ విషయాన్ని సూచిస్తుంటారు. పంటి సమస్య ఏ చిన్నదైనా సరే నిర్లక్ష్యం వహించకూడదంటారు. సాధ్యమైనంత త్వరగా వైద్యుని సంప్రదించి ప్రారంభంలో చికిత్స చేయించుకోవాలి. పంటి నొప్పి, చిగుళ్ల నుంచి రక్తం కారడం, పళ్లలో సెన్సిటివిటీ వంటి సమస్యల్ని ఏ మాత్రం నిర్లక్ష్యం వహించకూడదు. ఇటీవలి కాలంలో అయితే పిల్లల్లో కూడా ఈ సమస్యలు కన్పిస్తున్నాయి. పాలబాటిల్ వినియోగించే చిన్నారుల్లో అయితే ముందు నాలుగు పళ్లు పాడైపోతుంటాయి. పాల బాటిల్ నుంచే పళ్ల పాడవడం ప్రారంభమౌతుందంటారు వైద్యులు. అందుకే పాలు తాగిన ప్రతిసారీ పిల్లల చిగుళ్లు, పళ్లు క్లీన్ చేస్తుండాలి. పట్టించుకోకుండా వదిలేస్తే సమస్య తీవ్రమౌతుంది. 


దంత వైద్యులు చేసే కీలకమైన సూచనలు


రోజుకు రెండుసార్లు పళ్లు శుభ్రం చేసుకోవాలి. ప్లాసింగ్ ప్రక్రియ ద్వారా పంటి గ్యాప్స్ క్లీన్ చేస్తుండాలి. షుగర్ ఎక్కువగా తినకూడదు. గంజి ఎక్కువగా ఉండే ఆహారం కూడా తగ్గించాల్సి ఉంటుంది. ప్రతిరోజూ క్రమం తప్పకుండా నాలుక క్లీన్ చేయాలి. ఏ చిన్న సమస్య ఉన్నా నిర్లక్ష్యం వహించకుండా తగిన చికిత్స చేయించుకోవాలి. చిగుళ్ల నుంచి రక్తం కారుతుంటే వెంటనే అప్రమత్తం కావాలి. ఎందుకంటే ఇది ఏ మాత్రం మంచిది కాదు. ప్రతి ఆరు నెలలకోసారి డెంటల్ చెకప్ తప్పకుండా ఉండాలి. 


Also read: Diabetes Control Tips: బ్లడ్ షుగర్ స్పైక్ నిరోధించాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవల్సిందే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook