Fingers Tingling: మీ వేళ్లు తరచూ తిమ్మిరి పడుతున్నాయా..అయితే జాగ్రత్త..ఈ లోపమున్నట్టే
Fingers Tingling: చాలామంది చేతులు, కాళ్ల వేళ్లు తిమ్మిరి పట్టడం వెనుక చాలా కారణాలే ఉన్నాయి. తినే ఆహారంలో పోషకాల లోపం, రక్త నాళికలు, ఎముకల రోగం వంటి ఇతర వ్యాధులు దీనికి కారణం కావచ్చు. అందుకే ఈ లక్షణాలుంటే అజాగ్రత్త వద్దు.
Fingers Tingling: చేతులు, కాళ్ల వేళ్లలో తిమ్మిరి పట్టడం ఏదో ఒక విటమిన్ లోపం కానేకాదు. సమస్య సాధారణంగా కన్పించినా దీని వెనుక కొన్ని వ్యాధులకు సంకేతం కావచ్చు.కాళ్లు, చేతులు, జాయింట్స్‌లో స్వెల్లింగ్ వల్ల కూడా ఈ సమస్య తలెత్తుతుంది. కాళ్లు, చేతుల వేళ్లు తిమ్మిరికి ఇంకా ఇతర కారణాలున్నాయి. పోషక పదార్ధాల లోపం, రక్త నాళికలు, ఎముకల బలహీనత వంటి వ్యాధులున్నాఈ లక్షణాలు కన్పిస్తాయి. విటమిన్ డి లోపంతో కూడా ఈ సమస్య తలెత్తతుంది.
విటమిన్ డి ఎందుకు అవసరం
విటమిన్ డి శరీరానికి చాలా అవసరం. విటమిన్ డి ప్రధాన విధి శరీరంలోని ఎముకలు, కండరాలను ఆరోగ్యంగా ఉంచడమే. విటమిన్ డి అనేది సాధారణంగా సూర్య కిరణాల్లో , చేపలు, పాలు గుడ్లలో లభిస్తుంది. శరీరంలో విటమిన్ డి లోపముంచే వివిధ రకాల సమస్యలు ఉత్పన్నమౌతాయి.
రికెట్స్ వ్యాధి: ఇది సాధారణంగా పిల్లల్లో వస్తుంది. ఎముకలు, కండరాల పెరుగుదలపై ప్రభావం పడుతుంది.
ఆస్టియోపోరోసిస్: ఇది పెద్ద వయస్సువారిలో కన్పిస్తుంది. ఎముకలు బలహీనమైపోతాయి.
న్యూరో మస్క్యులర్ సమస్యలు: విటమిన్ డి లోపముంటే శరీరంలోని కండరాల పెరుగుదలపై ప్రభావం పడుతుంది. దీంతో కండరాలు బలహీనమౌతాయి. ఫలితంగా న్యూరో మస్క్యులర్ సమస్య ఉత్పన్నమౌతుంది.
డిప్రెషన్, అధిక అలసట..విటమిన్ డి లోపంతో ఎక్కువ అలసట, డిప్రెషన్ రావచ్చు.
విటమిన్ డి లభించే పదార్ధాలు
మష్రూం
మష్రూంలో విటమిన్ డి పెద్దమొత్తంలో ఉంటుంది. వారానికి కనీసం 2-3 సార్లు మష్రూం తినడం వల్ల విటమిన్ డి లోపం తొలగిపోతుంది.
సూర్య కిరణాలు
సూర్య కిరణాల్లో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ డి లోపాన్ని సరిజేసేందుకు ఇదే అద్భుతమైన సహజ సిద్ధమైన మార్గం. ఉదయం లేదా సాయంత్రం నీరెండలో నిలుచుంటే విటమిన్ డి శరీరానికి కావల్సినంతగా లభిస్తుంది. అందుకే సహజంగా వైద్యులు పుట్టిన శిశువుల్ని ఉదయం వేళ కాస్సేపు ఎండకు కూర్చోబెట్టమంటారు.
పాలు
పాలు కూడా విటమిన్ డికు మంచి ప్రత్యామ్నాయం. ఒక కప్పు పాలలో దాదాపు 100 ఐయూల విటమిన్ డి ఉంటుంది.
సన్‌ఫ్లవర్ ఆయిల్
సన్‌ఫ్లవర్ ఆయిల్‌లో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. అయితే తినే పదార్ధాల్లో కాకుండా చర్మానికి రాయడానికి ఉపయోగించాలి. వీటితో పాటు విటమిన్ డి లోపాన్ని సరిజేసేందుకు చాలా రకాల మందులు కూడా అందుబాటులో ఉన్నాయి.
Also read: Thyroid Control Tips: థైరాయిడ్ సమస్యకు ఇదే సమాధానం, ఈ విత్తనాలు డైట్‌లో ఉంటే చాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook