Almond Side Effects: బాదంతో లాభాలే కాదు దుష్పరిణామాలు కూడా ఉన్నాయని తెలుసా
Almond Side Effects: సహజంగానే డ్రై ఫ్రూట్స్ అనేవి ఆరోగ్యానికి చాలా మంచివి. శరీరానికి కావల్సిన అన్ని పోషకాలు వీటిలో పుష్కలంగా ఉంటాయి. అందుకే రోజూ డ్రై ఫ్రూట్స్ తినమని సూచిస్తుంటారు వైద్యులు. అయితే డ్రై ఫ్రూట్స్‌తో దుష్పరిణామాలు కూడా ఉన్నాయంటే నమ్ముతారా..ఆ వివరాలు మీ కోసం..
Almond Side Effects: డ్రై ఫ్రూట్స్ పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది బాదం. సంపూర్ణ ఆరోగ్యం కోసం బాదం చేసే మేలు అంతా ఇంతా కాదు. అద్భుతమైన పోషక విలువలుంటాయి బాదంలో. రోజూ క్రమం తప్పకుండా తగిన మోతాదులో బాదం సేవిస్తే ఆరోగ్యానికి చాలా మంచిది.
బాదం, పిస్తా, వాల్ నట్స్, అంజీర్, జీడిపప్పు వంటి డ్రై ఫ్రూట్స్‌లో పోషక పదార్ధాలు మెండుగా ఉంటాయి. ఇందులో అతి ముఖ్యమైంది బాదం. ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలున్నాయి. బాదం ఒక్కటే కాదు బాదం నూనె కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేకూరుస్తుంది. మనిషి శరీర నిర్మాణంలో విటమిన్లు, మినరల్స్ పాత్ర కీలకం. ఇవి శరీర నిర్మాణంతో పాటు వికాసానికి కూడా దోహదపడతాయి. బాదంలో ఫైబర్, ప్రోటీన్లు, విటమిన్ ఇ, మెగ్నీషియం, మాంగనీస్, కాపర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బాదం క్రమం తప్పకుండా తీసుకుంటే ఎముకలకు పటిష్ఠత, బరువు అదుపులో ఉండటం, మానసికంగా సమతుల్యత, గుండె జబ్బులు, కేన్సర్ నియంత్రణలో ఉంటాయి.
అయితే బాదంతో దుష్పరిణామాలు కూడా ఉంటాయనే విషయం చాలామందికి తెలియదు. ఆరోగ్యానికి మంచిది కదా అనే కారణంతో పరిమితికి మించి బాదం తీసుకుంటే ఆరోగ్యానికి అనర్ధమే. ఆరోగ్యానికి ప్రతికూల పరిణామాలు ఎదురౌతాయి. మేలు జరిగే మాట అటుంచితే ప్రతికూల ప్రభావం పడుతుంది. బాదం మోతాదు మించి తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైనవాటికంటే ఎక్కువ మోతాదులో న్యుట్రియంట్లు, మినరల్స్ పెరిగిపోతాయి. ఫలితంగా కడుపులో తిప్పినట్టుండటం, వాంతులు, విరేచనాలు, జీర్ణ సంబంధిత సమస్యలు ఉత్పన్నమౌతాయి. అదే సమయంలో కొంతమందికి లాక్టోస్ అంటే ఎలర్జీ ఉంటుంది. ఈ సమస్య ఉన్నవాళ్లు కూడా బాదం పాలకు దూరంగా ఉండాలి. బాదం పాలలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉన్నందున డయాబెటిస్ వ్యాధిగ్రస్థులు తక్కువ మోతాదులోనే బాదం స్వీకరించాలి.
థైరాయిడ్ సమస్యకు కారణం కానుందా
బాదం పాలను సాధారణంగా గోయిట్రోజెనిక్ ఆహారంగా పిలుస్తారు. గోయిట్రోజెనిక్ ఆహారం ధైరాయిడ్ సమస్యకు మూలకారణాల్లో ఒకటి. అందుకే బాదం పాలు మోతాదుకు మించి తీసుకోవడం వల్ల థైరాయిడ్ సమస్య పెరగవచ్చు. అంటే డ్రై ఫ్రూట్స్ రారాజుగా పిల్చే బాదంతో ఆరోగ్యపరంగా ఎన్ని ప్రయోజనాలున్నా మోతాదు మించితే హాని తప్పదు. సహజంగానే బాదం అనేది ప్రోటీన్ ఫుడ్. ప్రోటీన్లు ఎప్పుడూ తగిన మోతాదులోనే ఉండాలి. లేకపోతే జీర్ణం చేసుకోవడం కష్టమౌతుంది.
Also read: Vitamin Deficiency: ఈ విటమిన్ లోపిస్తే జ్ఞాపకశక్తి , కంటి సమస్యలు తప్పవు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook